Share News

జీవో 317 బాధితులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:25 AM

గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, వెంటనే బాధితులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

జీవో 317 బాధితులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, వెంటనే బాధితులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట జీవో 317తో స్థానభ్రంశం చెందిన ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో న్యాయం కోసం ధర్మ పోరాటం పేరిట నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరై 317 జీవో బాధితులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే జీవో 317పై ఉప సంఘం ఇచ్చిన జీవోను బహిరంగ పరచాలని డిమాండ్‌ చేశారు. బదిలీపై ఇతర జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను వెంటనే వారి సొంత జిల్లాలకు ప్రభుత్వం బదిలీ చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, నర్సయ్య, వివిధ సంఘాల రాష్ట్ర బాధ్యులు ఎం రఘుశంకర్‌రెడ్డి, పులి సర్వోత్తంరెడ్డి, మాడుగుల రాములు, జైపాల్‌రెడ్డి, గాజుల రవీందర్‌, హుస్సేన్‌, రవీంద్రాచారి, తిరుపతి, జేఏసీ గౌరవ అధ్యక్షుడు పింగళి రమేశ్‌రెడ్డి, అధ్యక్షుడు భారత్‌ కుమార్‌స్వామి, వేముల శ్రీనివాస్‌, దత్తు, అబ్దుల్‌ రజాక్‌, ప్రసూన, మమత, రత్నమాల, అజయ్‌, మహేందర్‌, శివ, నరసయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 12:25 AM