Share News

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:56 PM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఽనిరసన చేపట్టారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

సుభాష్‌నగర్‌, జూలై5: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఽనిరసన చేపట్టారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడిం దన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే చేస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని సంపత్‌ విమర్శించారు. మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు చేయూత, జాబ్‌ క్యాలెండర్‌, ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్‌ల హామీలను కాంగ్రెస్‌ విస్మరించిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం కోసం ప్రతినిత్యం పనిచేస్తుందన్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే గతంలో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందన్నారు. బీజేవైఎం శ్రేణులను ముందుస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూపు-2, గ్రూపు-3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని, 25వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని, అన్ని నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు. పోలీసు కానిస్టేబుల్‌ నియమకాల్లో 46జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి క్రాంతి, మీడియా ఇంచార్జీ కటకం లోకేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు శశిధర్‌రెడ్డి, శ్రీరాములు, శ్రీకాంత్‌, ప్రవీణ్‌, ఉప్పారపల్లి శ్రీనివాస్‌, కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు సంపత్‌, అజయ్‌, నికేష్‌, అశోక్‌, అనిల్‌, తోట సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:56 PM