Share News

రేషన్‌ దుకాణాలపై ఫోకస్‌

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:40 AM

రేషన్‌ దుకాణాల్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న బినామీ డీలర్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది.

రేషన్‌ దుకాణాలపై ఫోకస్‌

జగిత్యాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ దుకాణాల్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న బినామీ డీలర్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే పౌరసరఫరా శాఖ అధికారులకు మార్గదర్శకాలు అందాయి. దుకాణాల తనిఖీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అధికారులు రంగంలోకి దిగనుండడంతో బినామీల గుండెల్లో గు బులు నెలకొంది. దుకాణం బోర్డుపై డీలరు పేరు ఒకరిది ఉంటే నడిపేది వేరే వ్యక్తి ఉంటున్నారు. కొందరు డీలర్లు మృతి చెందితే ఆ స్థానంలో కు టుంబీకులకు ఇవ్వకుండా ఇతరులు చలామణి అవుతున్నారు. ఇక నుంచి బినామీ డీలర్లు అనే వారే లేకుండా చూడాలని పౌరసరఫరా శాఖ కమి షనర్‌ ఇటీవల ఆదేశించారు. ప్రతి రోజు దుకాణాలను తనిఖీ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా బినామీ రేషన్‌ డీలర్లు పదుల సంఖ్యలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు ఏళ్ల తరబడి రేషన్‌ దుకాణాల్లో పాతుకుపోయారు. వాస్తవానికి డీలరు చనిపోయినా, రాజీనా మా చేసినా కొత్త వారిని నియమించాలి. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. చాలా చోట్ల ఒకే డీలరు మూడు, నాలుగేసి దుకాణాలకు ఇన్‌చార్జి గా వ్యవహరిస్తున్నారు. ఇందులో పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నారు. కొంద రికి రాజకీయ పలుకుబడి ఉండటంతో అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజా నిర్ణయం నే పథ్యంలో వారిపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో రేషన్‌ డీలర్ల సంఖ్య..

జిల్లా వ్యాప్తంగా 587 రేషన్‌ దుకాణాలున్నాయి. ఇందులో రెగ్యులర్‌గా పనిచేస్తున్న డీలర్లు 505 మంది ఉన్నారు. 82 దుకాణాల్లో ఇన్‌చార్జిలు రేషన్‌ డీలర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బీర్‌పూర్‌ మండలంలో 16 దుకాణాలకు గాను 15 మంది డీలర్లు, ఒకటి ఇన్‌చార్జి, బుగ్గారంలో 14 దుకాణాలకు గాను 13 మంది డీలర్లు, ఒకటి ఇన్‌చార్జి ధర్మపురి మండ లంలో 34 మంది డీలర్లకు గాను 33 మంది డీలర్లు, ఒకటి ఇన్‌చార్జిలు నిర్వహిస్తున్నారు. గొల్లపల్లిలో 34కు గాను 32 మంది డీలర్లు, 2 ఇన్‌చార్జిలు, ఇబ్రహీంపట్నంలో 25కు గాను 21 డీలర్లు, 4 ఇన్‌చార్జిలు, జగిత్యాల అర్బన్‌లో 56కు గాను 50 డీలర్లు, 6 ఇన్‌చార్జిలు, కథలాపూర్‌లో 28కి గా నూ 26 డీలర్లు, 2 ఇన్‌చార్జిలు, కొడిమ్యాలలో 30కి గాను 24 డీలర్లు 6 ఇన్‌చార్జిలు, కోరుట్లలో 51కి గానూ 45 డీలర్లు, 6 ఇన్‌చార్జిలు నిర్వహిస్తు న్నారు. మల్లాపూర్‌లో 37కి గానూ 32 డీలర్లు 5 ఇన్‌చార్జిలు, మల్యాలలో 28కి గానూ 21 డీలర్లు, ఏడుగురు ఇన్‌చార్జిలు, మేడిపల్లిలో 33కి గానూ 23 డీలర్లు, 10 ఇన్‌చార్జిలు, మెట్‌పల్లిలో 51కి గానూ 47 డీలర్లు, నలుగురు ఇన్‌ చార్జిలు, పెగడపల్లిలో 29కి గానూ 23 డీలర్లు, ఆరుగురు ఇన్‌చార్జిలు, రాయికల్‌లో 40కి గానూ 32 డీలర్లు, ఎనిమిది ఇన్‌చార్జిలు, సారం గపూర్‌లో 15కి గానూ 12 డీలర్లు, ముగ్గురు ఇన్‌చార్జిలు, వెల్గటూరులో 35కి గానూ 29 డీలర్లు, ఆరుగురు ఇన్‌చార్జిలు, జగిత్యాల రూరల్‌ మండ లంలో 31కి గానూ 27 మంది డీలర్లు, నాలుగు దుకాణాలు ఇన్‌చార్జిలు నిర్వహిస్తున్నారు.

21వ తేదీలోపు నివేదికకు కసరత్తులు...

జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో వచ్చే రెండు, మూడు రోజుల్లో వి స్తృతంగా అధికారులు సోదాలు నిర్వహించనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృం దాలు, ఆర్డీవోలు, తహసీల్దారు, రేషన్‌ దుకాణాలను తనిఖీ చేస్తారు. దుకా ణంలో ఉన్న డీలరు పేరు...రికార్డులో ఎవరి పేరుందో పరిశీలిస్తారు. బి య్యం నిల్వలు తనిఖీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. డీలరు చనిపోతే ఎప్పుడు వారి కుటుంబ సభ్యులు నడుపుతున్నారా.. ఇతరులెవరైనా కొన సాగిస్తున్నారా...అనేది పరిశీలిస్తారు. ఈ వివరాలు ఈ నెల 21వ తేదీ లో పు ప్రభుత్వానికి నివేదించడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

పక్కాగా పరిశీలిస్తేనే....

కొన్ని దుకాణాల్లో అసలైన డీలర్లు వేరే పని చేస్తున్నారు. మరికొందరు వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. తనిఖీల సమయంలో అసలైన డీలర్లను తీసుకొచ్చి దుకాణాల్లో కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఏళ్ల తరబడి నుంచి దుకాణం ఎవరు నడిపిస్తున్నారో కార్డుదారులను అడిగి తె లుసుకుంటే బినామీల బాగోతం బయటపడుతుంది. నామమాత్రంగా పరి శీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందినప్పటికీ సంబందిత జిల్లా పౌరసరఫరా అధికారి సెలవుల్లో ఉండడం కారణంగా జిల్లాలో తనిఖీలు ఇంకా ప్రారంభం కాన ట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత దృష్టికి తీసుకవెళ్లి తనిఖీలు చేయడానికి పౌరసరఫరా శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. తనిఖీల్లో అధికారులు పక్కాగా పరిశీలించా లన్న డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది. తనిఖీలు ఎలా జరుగుతాయి ...రేషన్‌ దుకాణాల్లో బినామీలు ఉన్నారా.. వారి బోగోతం ఏమిటీ అన్నది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల సోదాల్లో తేలాల్సి ఉంది.

మార్గదర్శకాలు వచ్చాయి

వెంకటేశ్వర్‌ రావు, జిల్లా పౌరసరాఫరా శాఖ అధికారి

రేషన్‌ దుకాణాలు తనిఖీ చేసి అసలైన డీలర్‌ ఎవరో గుర్తించాలని కమిషనర్‌ నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. దీనికి అనుగుణంగా తనిఖీలు చేయిస్తాం. బియ్యం పంపిణీ సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలతో పాటు ఆర్డీవో, తహసీల్దారు దుకాణాలు పరిశీలిస్తారు. కమిషనర్‌ సూచిం చిన నిర్ణీత సమయంలో నివేదిక అందించడానికి చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - Jan 12 , 2024 | 12:40 AM