Share News

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి

ABN , Publish Date - May 27 , 2024 | 11:58 PM

జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులను నియం త్రించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద అనిల్‌, మల్లారపు ప్రశాంత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్‌, భీమ్‌ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్‌, లంబాడీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్‌ నాయక్‌, బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్‌ కోరారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి
వినతి పత్రాన్ని అందజేస్తున్న నాయకులు

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 27 : జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులను నియం త్రించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద అనిల్‌, మల్లారపు ప్రశాంత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్‌, భీమ్‌ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్‌, లంబాడీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్‌ నాయక్‌, బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్‌ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్న యాజ మాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ఆవరణలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, టై, బెల్ట్‌, ఇతర సామగ్రి విక్రయిస్తున్నారన్నారు. విద్యను వ్యాపారం చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజులను నోటీసు బోర్డులో ప్రదర్శించడం లేదన్నారు. ఇంటర్నేషనల్‌, ప్లేస్కూల్‌, డీజీ, సీబీఎస్సీ లీడ్‌ కరికులం పేరుతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. సమ్మర్‌ క్యాంపుల పేరిట అడ్మిషన్లు చేపడుతున్నారని, తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా అదనపుకలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ స్పందిస్తూ విద్యాశాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - May 27 , 2024 | 11:58 PM