Share News

సాగునీరు విడుదల చేయాలని రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:55 PM

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ద్వారా సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ మంథని- గోదావరిఖని ప్రధాన రహదారిపై రైతులు మంగళ వారం రాస్తారోకో నిర్వహించారు.

సాగునీరు విడుదల చేయాలని రైతుల రాస్తారోకో

మంథని, మార్చి 26: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ద్వారా సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ మంథని- గోదావరిఖని ప్రధాన రహదారిపై రైతులు మంగళ వారం రాస్తారోకో నిర్వహించారు. మంథని పట్టణం లోని పోచమ్మవాడ, మండలంలోని మల్లెపల్లి గ్రామా నికి చెందిన రైతులు వైజంక్షన్‌ వద్ద ఆందోళనకు దిగారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పం టల సాగుచేస్తే పంటలు పొట్ట దశకు వచ్చిన తరు ణంలో కాలువల ద్వారా సకాలంలో సాగు నీరు అం దించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతు లు వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. గతంలో రైతులకు సరిపడా సా గునీరు వచ్చిందని, ఇప్పుడు పంటలు ఎండిపోయే కాలం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారు లు, ప్రభుత్వం రైతులను పట్టించుకొని పంటకు సా గునీరు ఇచ్చి పంటలను రక్షించాలని కోరారు. దాదా పు గంటపాటు రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహిం చడంతో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు ధర్నా విర మించాలని కోరినా వారు ససేమీరా అనడంతో ఇరి గేషన్‌ అధికారి అక్కడకు చేరుకొని రైతులతో మా ట్లాడారు. పంటలను కాపాడటానికి సాగునీరు అందేలా చర్యలు తీసు కుంటామని హామీ ఇవ్వ డంతో రైతులు ఆందోళన విరమించారు. మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 11:55 PM