సాగునీరు విడుదల చేయాలని రైతుల రాస్తారోకో
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:04 AM
ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ద్వార సాగునీటి ప్రభుత్వం విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
మంథని, మార్చి 7: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ద్వార సాగునీటి ప్రభుత్వం విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మండలంలోని సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, గంగాపురి ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామాలకు చెందిన రైతులు మంథనిలోని పాత పెట్రోల్‌పంపు చౌరస్తాలో ఆందోళనకు దిగారు. అధికారులు, ప్రభుత్వం రైతులను పట్టించుకొని పంటకు సాగునీరు ఇచ్చి పంటలను రక్షించాలని కోరారు. ఆర్డీవో హనుమా నాయక్ ధన్నా వద్వకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈనెల 9వరకు రైతులకు సాగు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రెతులు ధర్నాను విరమించారు. మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.