Share News

రైతు సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:30 AM

రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతు సమస్యలు పరిష్కరించాలి

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 5 : రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి అధ్యక్షత న పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్‌ కార్యాలయంలో శుక్ర వారం రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గానికి చెందిన వారు, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు మీసా అర్జున్‌రావు ఆధ్వర్యంలో గుజ్జు ల నివాసంలో దీక్ష చేపట్టారు. ప్రదీప్‌రావు వర్గీయు లకు గోమసే శ్రీనివాస్‌ నిమ్మరసం ఇచ్చి దీక్షను విర మింప చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడు తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారాన్ని అందించా లని డిమాండ్‌ చేశారు. మిగిలిన పంట పొలాలు ఎండిపోకుండా డి 83, డి 86 కాల్వల ద్వారా మరొక తడి పంటలకు నీరు ఇవ్వాలని, రూ.2లక్షల రుణ మాఫీ, 15వేల రూపాయల రైతు భరోసా, వరికి ఐదు వందల రూపాయల బోనస్‌ ఇవ్వాలన్నారు. సాగునీరు అందక ఎండిన పంటలకు ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కలిసి కదులుదాం.. మరోసారి మోదీని గెలిపిద్దాం అనే నినాదంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ నినాదమే విధానంగా నూట నలభై కోట్ల భారతీయుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అనేక అద్భుత విజయాలను సాధించినట్లు గుర్తుచేశారు. ఐదు సంవత్సరాల అయోధ్య రామ మందిరం, ఆర్టి కల్‌ 370 రద్దుతో జమ్ము కాశ్మీర్‌లో శాంతి, అంతరిక్ష అద్భుతాలు, చట్టసభలలో మహిళలకు 32శాతం రిజర్వేషన్‌ కల్పించడం, డిజిటల్‌ పేమెంట్లు, కరోనా సమయంలో ప్రపంచానికి ప్రేరణగా ఉండి భార త శక్తిసామర్థ్యాలు చాటుతూ విజయవంతంగా 20 సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ దీక్ష సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిలారపు పర్వతాలు, గొట్టముక్కల సురేష్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ దాడి సంతోష్‌, నాయకులు తంగడ రాజేశ్వరరావు, ఠాకూర్‌ రాంసింగ్‌, అది కేశవరావు, పెన్నింటి రాజు, సిలివేరు ఓదె లు పల్లె సదానందం, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పర్స సమ్మయ్య, ఎండి ఫహీముద్దీన్‌, రాజం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:30 AM