Share News

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:41 PM

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం రైతు నిరసన దీక్షలు చేపట్టారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 6: బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం రైతు నిరసన దీక్షలు చేపట్టారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం చేపట్టిన రైతు దీక్ష శిబిరంలో దాసరి మనోహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతుల ధాన్యానికి క్వింటాలుకు ఐదు వందల రూపాయలు బోనస్‌ చెల్లించా లని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించి న విధంగా రూ. 2లక్షల రైతు రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే బీఆర్‌ఎస్‌ పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రఘువీర్‌సింగ్‌, ఎంపీపీలు బండారి స్రవంతి శ్రీనివాస్‌, నూనెటి సంపత్‌, జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి వెంకట్‌ రెడ్డి, పురం ప్రేమ్‌ చందర్‌ రావు, పట్టణాధ్యక్షులు ఉపుఁ రాజ్‌ కుమార్‌, జూలపల్లి విండో ఛైర్మెన్‌ సందీప్‌ రావు, దాసరి ఉష, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:41 PM