ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:23 PM
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో రోగులకు కనీస సౌకర్యాలు అందించడంలో అధికారులు విఫలమ య్యారని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు ఆరో పించారు.
కళ్యాణ్‌నగర్, మార్చి 3: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో రోగులకు కనీస సౌకర్యాలు అందించడంలో అధికారులు విఫలమ య్యారని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు ఆరో పించారు. ఆదివారం టీడీపీ బృందం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కొద్ది రోజులుగా తాగడానికి మంచినీరు రావడం లేదని, రోగులు బయటనుంచి మంచినీటిని కొనుక్కుటున్నారన్నారు. రోగులకు బెడ్‌షీట్లను వేయడం లేదని, బెడ్లను దగ్గర వేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. న్యూరో డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలన్నా రు. కంది చంద్రయ్య, దామోదర్‌రెడ్డి, చల్లా రవీందర్, రాయనర్సు, వీ రేందర్, కిరణ్, స్వరాజ్యం, కళావతి, అశ్విని, బాణమ్మ, లక్ష్మి ఉన్నారు.