Share News

కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీని బహిర్గతం చేస్తాం

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:01 AM

కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసిన దోపిడీ అంతా త్వరలో నే బయటికి వస్తుందని, ఇందులో అక్రమాలకు పాల్పడిన వారందరికీ తగిన శిక్ష పడుతుందని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శశిభూషన్‌కాచే, ఎంపీపీ కొండ శంకర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు అయిలి ప్రసాద్‌లు అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీని బహిర్గతం చేస్తాం

మంథని, ఏప్రిల్‌ 11: కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసిన దోపిడీ అంతా త్వరలో నే బయటికి వస్తుందని, ఇందులో అక్రమాలకు పాల్పడిన వారందరికీ తగిన శిక్ష పడుతుందని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శశిభూషన్‌కాచే, ఎంపీపీ కొండ శంకర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు అయిలి ప్రసాద్‌లు అన్నారు. గురువారంలో వారువిలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పరిషత్‌ చైర్మ న్‌ పుట్ట మధు తనపై కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలకు దూరం చేశారని.. తాను అక్రమాలు చేస్తే ఎందుకు రుజువు చేయడం లేదని మాట్లాడారన్నారు. త్వరలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు బయటికి వస్తా యన్నారు. పుట్ట మధు నన్ను ఎప్పుడు జైలు పంపుతారా అని వేచిచూస్తున్నట్లు గా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలన్నింటిని బయటికి తీసుకువచ్చే పనిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కీల కమైన మేడిగడ్డ, అన్నారం, సిరిపురం బ్యారేజీల నిర్మాణం లోపాలపై, భూసేకర ణ సక్రమంగా జరిగిందా, ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసమా.. లేక ఇసుక కోసమా అనే విషయాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రా జెక్టును అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ నుంచి పుట్ట మధు వరకు అందరికీ శిక్ష పడుతుందన్నారు. అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గం లో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, దాడులు చేశారన్నారు. వీటన్నిం టికి తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. పుట్ట మధూకర్‌ను ప్రజలు గమనిం చారు కాబట్టే గత ఎన్నికల్లో 18 వేల ఓట్లు, తాజాగా జరిగిన ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజార్టీని కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో ఉచిత కరెంట్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్‌ సబ్సిడీ అమలుచేశామన్నారు. తన నాయకుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన రహదారులు అద్దంలా మెరుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో కూడా కాం గ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు వొడ్నాల శ్రీనివాస్‌, పేరవేన లింగయ్య యాదవ్‌, పోలు శివ, మంథని సత్యం, ఎరుకల ప్రవీణ్‌, తోకల మల్లేలు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:01 AM