Share News

ఎన్టీపీసీలో 176 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ విస్తరణ

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:20 AM

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సోలార్‌ విద్యుత్‌ విస్తరణకు శ్రీకా రం చుట్టారు.

ఎన్టీపీసీలో 176 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ విస్తరణ

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 29 : ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సోలార్‌ విద్యుత్‌ విస్తరణకు శ్రీకా రం చుట్టారు. 176 మెగావాట్ల కొత్త సోలార్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్టీపీసీ ఈడీ కేదార్‌ రంజన్‌ పాండు సోమవారం భూమిపూజ చేశారు. ఇప్పటికే 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు, 10మెగావాట్ల సౌర విద్యుత్‌(సర్ఫేస్‌) ప్రాజెక్టును నిర్వహి స్తున్న ఎన్టీపీసీ మరో 176 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ విస్తరణ చేపట్టింది. దీనిలో భాగం గా 120 మెగావాట్ల సర్ఫేస్‌ సోలార్‌ ప్రాజెక్టుతోపాటు, ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వా యర్‌లోనే 56 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సౌర ద్యుత్‌ ప్రాజెక్టును నిరిళిస్తున్నది. ఈ ప్రాజె క్టు పూర్తయితే మొత్తం 286మెగావాట్ల సోలార్‌ స్థాపిత సామర్తానికి ఎన్టీపీసీ చేరు కుంటుంది. ఈ కార్యక్రమంలో జీఎంలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:20 AM