ఉత్సాహంగా హాఫ్ మారథాన్
ABN , Publish Date - Sep 23 , 2024 | 12:23 AM
కరీంనగర్ సైక్లిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్టేడియంలో మారథాన్‌ను కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు.
కరీంనగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 22: కరీంనగర్ సైక్లిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్టేడియంలో మారథాన్‌ను కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం వాకింగ్, రన్నింగ్ చేస్తే శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతామని అన్నారు. ప్రతి రోజు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అన్నారు. అనంతరం కరీంనగర్ సైక్లిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఐవీవై విద్యాసంస్థల అధినేత పసుల మహేశ్ మాట్లాడుతూ నగరవాసులకు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు మారథాన్ కార్యక్రమాన్ని 3కే, 6కే, 10కే, 21కే విభాగాల్లో నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అల్ఫోర్స్ చైర్మెన్ నరేందర్‌రెడ్డి, పలు పాఠశాలల విద్యార్థులు, పోలీసు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.