Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:18 PM

పిల్లలకు పోలియో సోకకుండా వారి నిండు జీవితానికి రక్షణగా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

పెద్దపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు పోలియో సోకకుండా వారి నిండు జీవితానికి రక్షణగా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం ఆయన మాతా, శిశు సం రక్షణ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల ్లలకు పోలియో చుక్కలువేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యా ప్తంగా పోలియో చుక్కలు వేయుటకు 381 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4040 పోలియో వాయిల్స్‌ను అన్ని కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు. బస్‌స్టేషన్‌, రైల్వే ప్రాం గణాల్లో సైతం 24 పోలియో ట్రాన్సిట్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని, జిల్లాలో వలస కార్మికులు, ఇటుక బట్టీలు, నిర్మాణ కార్మికుల కోసం 149ప్రాంతాలను గుర్తిం చి అక్కడికి 24మొబైల్‌ బృందాల ద్వారా పోలియో చుక్కలు వేస్తారని, వీటిని విని యోగించుకుంటూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. అనంతరం ఆయన జిల్లా ప్రభుత్వఆసుపత్రిలో వార్డులను తనిఖీలు చేసి రోగులను కలిసి వారీ ఆరోగ్య పరిస్థితులను, హాస్పిటల్‌ సదుపాయాల అడిగితెలు సుకున్నారు. ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచుతూ, రోగులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె ప్రమో ద్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాకాంత్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటేశ్వ ర్లు, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:19 PM