ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి
ABN , Publish Date - Feb 26 , 2024 | 11:46 PM
ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3,4,5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
సుభాష్‌నగర్, ఫిబ్రవరి 26: ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3,4,5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు వయస్సుగల చిన్నారులు 89,273 మంది ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 545 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పంచాయతి కార్యదర్శులు వివిద శాఖల అధికారులు, సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ జువైరియా, డీఐవో డాక్టర్ సాజిదఅతహరి, డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్ అదల్‌నిగమే, డీఈవో జనార్దన్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి పాల్గొన్నారు.