Share News

ప్రభుత్వం మారినా అవినీతి తగ్గలేదు

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:17 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సింగరేణిలో అవినీ తి తగ్గలేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు.

ప్రభుత్వం మారినా అవినీతి తగ్గలేదు

గోదావరిఖని, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సింగరేణిలో అవినీ తి తగ్గలేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. బుధవా రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న అవినీతినే పెంచి పోషించుకుంటూ వస్తున్నారు తప్ప అవినీతి మాత్రం తగ్గడం లేదని, గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టి దోచుకోవడమే జరుగుతుందన్నారు. ఇప్పటికీ మెడికల్‌బోర్డులో జరిగే అవినీతి అందరికి తెలు సునని, అయినా చర్యలు తీసుకోవడంలో విజిలెన్స్‌ అధికారులు వెనుకడుగు వేయడానికి కారణం ఏమిటో తెలియడం లేదన్నారు. అమాయకులపైన చర్యలు తీసుకోవడానికి ఉత్సాహం చుపుతూ అవినీతికి పాల్పడుతూ కార్మికుల రక్తాన్ని పీల్చుకుంటున్న జలగలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం విజిలెన్స్‌ కలిసి కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అవినీతి, క్వార్టర్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతిని అరికట్టా లని, అప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. గతంలో ఎమ్మెల్యే జో క్యం పెరుగుతుందని చెప్పిన నాయకులే ఇప్పుడు వారితో వేదికలు పంచుకోవ డం సింగరేణిలో మార్పు లేదని స్పష్టమవుతుందన్నారు. గెలిచిన సంఘాల నా యకులు పని చేస్తూ ఆదర్శంగా ఉండాలే తప్ప యాజమాన్యానికి తొత్తుగా మా రవద్దని, సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ కార్మికుల సమస్యలపై యాజమాన్యాన్ని ప్రశ్నించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్‌ కార్యదర్శి మెండె శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు రాజమొగిలి, విజయ్‌కుమార్‌, దాసరి సురేష్‌, రవి, ప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, రాంప్రసాద్‌, రాము పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:17 AM