Share News

కమిషనరేట్‌లో సోషల్‌ మీడియా ట్రాకింగ్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:34 PM

సోషల్‌ మీడియాలో వ్యక్తిగత చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

కమిషనరేట్‌లో సోషల్‌ మీడియా ట్రాకింగ్‌ సెంటర్‌ ఏర్పాటు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 25: సోషల్‌ మీడియాలో వ్యక్తిగత చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకు గాను రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా సోషల్‌ మీడియా ట్రాకింగ్‌ సెంట ర్‌(ఎస్‌ఎంటీసీ)ను పెట్టారు. గురువారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌ల్లో రాజకీయ నేతలను టార్గెట్‌గా చేసుకుని, మతాన్ని, మతానికి సం బంధించిన ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుని పోస్టులు పెడుతున్నారని, ఓ వర్గా న్ని కించపరుస్తూ పోస్టుచేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకా ర్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానాతోపాటు కేసు తీవ్రతను బట్టి జీవితఖైదు పడే అవకాశం కూడా ఉంటుం దన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ముందు, వచ్చిన పోస్టులను ఫార్వర్డ్‌ చేసేముందు అవి నిజామా, కాదా అని ఆలోచించుకోవాలన్నారు. 24గంటల పాటు సోషల్‌ మీడియా పోస్టులపై నిరంతర నిఘా ఉంటుందని, మత ఘర్షణలు జరిగే లా, లా అండ్‌ఆర్డర్‌ సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లేని పోని అబద్దపు పుకార్లను సృష్టించి పోస్టులు పెట్టే వారిపై మానిటరింగ్‌ సెల్‌ నిఘా ఉంటుందన్నారు. కొందరు ఐపీ అడ్రస్‌లు మార్చి ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నార ని, వారిని కూడా వదలమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) సీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్‌స్పెక్టర్‌ ముత్తిలింగయ్య, ఎస్‌ఐ రాజమణి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:34 PM