Share News

ఏటీసీతో యువతకు ఉపాధి అవకాశాలు

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:57 AM

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రూ.42 కోట్లతో చేపట్టనున్న ఏటీసీ కోసం బుధవారం కలెక్టర్‌ సందీప్‌ కూమార్‌ ఝాతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

ఏటీసీతో యువతకు ఉపాధి అవకాశాలు
స్థలాన్ని పరిశీలిస్తున్న విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీ్‌పకుమార్‌ ఝా

రుద్రంగి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రూ.42 కోట్లతో చేపట్టనున్న ఏటీసీ కోసం బుధవారం కలెక్టర్‌ సందీప్‌ కూమార్‌ ఝాతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పక్కన ఉన్న స్థలాన్ని, బస్టాండ్‌ వద్ద గుట్టపై స్థలాన్ని పరిశీలించారు. ఏటీసీ కోసం సూమారు ఐదెకరాల స్థలం సర్వే చేయాలని ఆదేశించారు. అనంతనం ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్థల సేకరణ పూర్తయిన అనంతరం వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ శ్రీలత, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్‌ తర్రె ప్రభలత మనోహర్‌, కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, కెసిరెడ్డి నర్సారెడ్డి, గండి నారాయణ, కోమిరె శంకర్‌, పల్లి గంగాధర్‌, ఇప్ప మహేష్‌, పిడుగు లచ్చిరెడ్డి, మాడిశెట్టి అభిలాష్‌, తర్రె లింగం, సూర యాదయ్య, స్వర్గం పరాంధామ్‌, పూదరి మహిపాల్‌, ఎర్రం ఆరవింద్‌, దువ్వాక గంగాధర్‌ పాల్గొన్నారు.

రెవెన్యూ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం ఏటీసీ స్థల పరిశీలన సమయంలో తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని గుట్టపైన ఉన్న రెవెన్యూ భూమిలో కొందరు అక్రమంగా గృహ నిర్మాణాలు చేపట్టడంతో వాటిని చూసిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ఆర్డీవోను ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని తహసీల్దార్‌ను ఆదేశిం చారు. అనంతరం కలెక్టర్‌ సందీప్‌ కూమార్‌ ఝా మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేయకూ డదని, అలా చేస్తే చట్టపరైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయనున్నట్లు చెప్పారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ శ్రీలత, ఆధికారులు పాల్గొన్నారు.

రుచికరమైన భోజనం అందించాలి

విద్యార్ధులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌ కూమార్‌ ఝా అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. కిచెన్‌ను పరిశీలించారు ఆలుగడ్డలు సరిగా లేవని, మెనూ ప్రకారం భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. నెయ్యి కూడా అందుబాటులో లేకపోవడంతో కేజీబీవీ ఎస్‌వోపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన కూరగాయలు సరఫరా చేయాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. ముందుగా విద్యార్థులతో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌ కూమార్‌ ఝా మాట్లాడారు. ఆట స్థలం ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు సూచించారు. పాఠ శాల ఆవరణలో మురుగు నీరు బయటకు రాకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ శ్రీలత, నాయకులు, పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 12:57 AM