Share News

ఎన్నికల నివేదికలను సకాలంలో సమర్పించాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:36 PM

లోక్‌సభ ఎన్నిక ల నివేదికలను సకాలంలో సమర్పించాలని, ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వ యంతో పని చేయాలని పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్‌ గుప్తా అన్నారు.

ఎన్నికల నివేదికలను సకాలంలో సమర్పించాలి

పెద్దపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నిక ల నివేదికలను సకాలంలో సమర్పించాలని, ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వ యంతో పని చేయాలని పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్‌ గుప్తా అన్నారు. గురు వారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబం ధించి వివిధ విభాగాలు చేసే కార్యక్రమాల నివేదికలను సకాలంలో సమర్పించాలన్నారు. పెద్దపల్లి పార్లమెం ట్‌ పరిధిలో తుది ఓటర్‌ జాబితా రూపొందించి ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయాలని, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పురోగతికి సంబంధించిన వివరాలు ఎప్పటికపుఁడు అందజేయాలని, పట్టణ, గ్రామీణప్రాంతాల్లో ప్రతి ఒక్క ఓటరుకు ముందస్తుగా ఓటర్‌ స్లిప్‌ అందేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో జారీ చేసిన పోస్టల్‌బ్యాలెట్‌ వివరాలు, వాటిలో ఎన్ని పోస్టల్‌ ఓట్లు నమో దయ్యాయి అనే అంశంపై ప్రతిరోజూ నివేదిక అందించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ మెటీరియల్‌ తరలించేందుకు అవసర మైన వాహనాలు సన్నద్ధం చేసుకోవాలని, ముందస్తుగా రూట్‌ పరి శీలించాలని, పట్టణ ప్రాంతాలలో ఇరుకు సందులలో పోలింగ్‌ కేం ద్రాలు ఉన్నాయా అక్కడికి వాహనం వెళ్లేందుకు వీలు ఉంటుందా ముందుగానే పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్‌ సమయం లో ఎన్నికల ఏజెంట్లకు సెల్‌ ఫోన్‌ అనుమతి ఉండదని, పోలింగ్‌ కేంద్రం వద్ద ఏజెంట్లు ఓటర్లతో సంభాషించడానికి వీలులేదని, దీని పై పోలింగ్‌ సిబ్బందికి తగిన సమాచారం ఆదేశాలు జారీచేయాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు. పోలీస్‌ పరిశీలకులు మాట్లా డుతూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే దిశగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్‌ నైరంతర్యా మాట్లాడుతూ అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరా లను పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. స్టాటిక్‌ సర్వేలె న్సు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వేలన్సు, వీడియో వ్యూయింగ్‌ , అకౌంటింగ్‌ బృందాలు వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి చేతన, పెద్ద పల్లి అదనపు కలెక్టర్లు జే.అరుణశ్రీ, శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌, జగిత్యాల, మంచిర్యాల అడిషనల్‌ కలెక్టర్‌ లు, రెవెన్యూ డివిజన్‌ అధికారులు బి గంగయ్య, హనుమా నాయక్‌, ఏసిపిలు, నోడల్‌ అధికారులు, సం బంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:36 PM