Share News

గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:09 AM

గ్రామాల సమగ్రాభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- ఎమ్మెల్యే విజయరమణారావు

కాల్వశ్రీరాంపూర్‌, జనవరి 29: గ్రామాల సమగ్రాభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామంలో ఐదు లక్షల నిధులతో చేపట్టే గ్రామపంచాయతీ ప్రహారి నిర్మాణం, 25 లక్షల నిధులతో చేపట్టే పశువైద్య ఆసుపత్రి, 20లక్షల రూపాయలతో చేపట్టే హెల్త్‌ సబ్‌సెంటర్‌కు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య మే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తుందన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గ్రామాల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం విడతల వారీగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు గ్యారంటీలను అమలు చేశారన్నారు. పెద్దరాత్‌పల్లి గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్‌ ఓరుగంటి కొమురయ్య ఐదు సంవత్సరాలుగా ఎన్నో నిధులు తీసుకువచ్చి గ్రామ రూపురేఖలే మార్చారని సర్పంచ్‌ ఓరుగంటి కొముర య్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గ్రామంలోని పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గ్రామానికి రావడంతో సర్పంచ్‌ కొమురయ్యగౌడ్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ ఓరుగంటి కొమురయ్యగౌడ్‌, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్‌, ఎంపీడీవో రాంమోనచారి, తహసీల్దార్‌ జాహె ద్‌పాషా, ఏఈ జగదీష్‌, సూపరిం టెండెంట్‌ సురేష్‌, వెటర్నరీ డాక్టర్లు సురేష్‌, సునీత, ప్రభుత్వ డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో బోల్లమల్ల కౌసల్య, శంకర్‌, ఉపసర్పంచ్‌ అల్లంల మహేష్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ మునీర్‌ పాల్గొన్నారు.

- రెండో ఏఎన్‌ఎంలను రెగ్యూలర్‌ చేయాలి

కాల్వశ్రీరాంపూర్‌: ప్రభుత్వం తమను రెగ్యులర్‌ చేయాలని రెండో ఏఎన్‌ఎంలు పెద్దరాతుపల్లిలో సోమవారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావుకు వినతిపత్రం అందజేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీంలో ప్రభుత్వం రెండో ఏఎన్‌ఎంలను నియమించిదన్నారు. 16సంవత్సరాలుగా కాంట్రాక్టు ఏఎన్‌ఎంలుగానే పనిచేస్తున్నామని, రెగ్యులర్‌ ఏఎన్‌ ఎంలతో సమానంగా పనిచేస్తున్నామన్నారు. తమను రెగ్యులర్‌ చేసేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యేకు వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారి లో పద్మ, సునీత, సరిత, సరోజన ఉన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:09 AM