Share News

రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

ABN , Publish Date - May 25 , 2024 | 12:31 AM

రామగుండం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌(డీఆర్‌ఎం) భరతేష్‌ కుమాఱ్‌ జైన్‌ సందర్శించారు.

రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

అంతర్గాం, మే 24: రామగుండం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌(డీఆర్‌ఎం) భరతేష్‌ కుమాఱ్‌ జైన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం అమృత్‌ భారత్‌ మహోత్సవ్‌లో భాగంగా రైల్వే స్టేషన్‌లో రూ.26కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనం తరం డీఆర్‌ఎం ప్లాట్‌ఫాంలను తనిఖీ చేసి ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమే అమృత్‌ భారత్‌ మహోత్సవ్‌ పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పలు కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌(ఎస్‌సీఆర్‌ఎంయూ) నాయకులు ఎం రామారావు, వీరన్నలు డీఆర్‌ఎం కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కార్మిక సంఘా ల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:31 AM