నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ డ్రైవర్ల సమ్మె
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:17 AM
నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ గోదావరిఖనిలో లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు.

కోల్‌సిటీ, జనవరి 11: నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ గోదావరిఖనిలో లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. బుధవారం అర్ధరాత్రి నుంచి రామగుండం లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ మోటార్ వర్కర్స్ యూనియన్, లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నెల 9వ తేది నుంచి 13వ తేది వరకు బుకింగ్ కూడా నిలిపివేస్తున్నట్టు లారీ యజమానుల సంక్షేమ సంఘం పేర్కొన్నది. ఈ చట్టాన్ని వెంటనే వాపసు తీసుకోవాలని, లారీ డ్రైవర్లతో పాటు సామాన్యులకు కూడా ఎంతో నష్టం చేకూరుస్తుందన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో డ్రైవర్స్ అసోసియేషన్ ఎండీ రషీద్, ఫినాజ్, లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కడారి సంతోష్‌రావు, దామోదర్‌రెడ్డి, బాబురావు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.