Share News

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:11 AM

పెద్దపల్లి పట్టణంలో వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూ చించారు.

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి

పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 19: పెద్దపల్లి పట్టణంలో వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూ చించారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వా ర్షిక బడ్జెట్‌ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. మిషన్‌ భగిరథ పనులు వెంటనే పూర్తిచేయాలని, ఇప్పుడు నడుస్తున్న పైప్‌ లైన్ల మరమ్మతు చేయించి ప్రతి ఇంటికి తాగునీరందించాలన్నారు. ఇంటినంబర్ల కోసం, ఇంటి అనుమతుల కోసం వచ్చే వారిని ఇబ్బం దులకు గురిచేయవద్దని సూచించారు. బడ్జెట్‌ను పూర్తిగా పరిశీలించి న ఎమ్మెల్యే మరింత ఆదాయం పెంచుకునేందుకు వనరులు సమ కూర్చుకోవాలని పేర్కొన్నారు. 2023-24గాను 13కోట్ల 50లక్షల89వేల రూపాయల అంచనా ఆదాయం ఉండగా, ఇందులోనుంచి అభివృదిఽ్ధ పనులనుకు అంచనా వ్యయం 12కోట్ల 84లక్షల 11వేలు ఉంది. మొ త్తం వ్యయం పోను 66లక్షల 78 మిగులు బడ్జెట్‌ ఉంటుందని సభ అమోదించింది. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ మాట్లాడుతూ ఇందులో పొదుపర్చిన అంశాలను ఆమోదిస్తే కలెక్టర్‌కు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ మమతారెడ్డి, నజ్మీన్‌ సుల్తానా, కమిష నర్‌ వెంకటేష్‌, మేనేజర్‌ శివప్రసాద్‌, కౌన్సిలర్లు, నూగిళ్ళ మల్లయ్య, బూతగడ్డ సంపత్‌, సంధ్య, దేవనంది రమాదేవి, పద్మ, కొలిపాక శ్రీనివాస్‌, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, ఫహీం, చంద్రమౌళి, తూముల సు భాష్‌, దేవనంది పురుషోత్తం, మహంత కృష్ణ, తదితరులున్నారు. కాగా, మున్సిపాలిటీ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను సోమ వారం ఎమ్మెల్యే విజయరమణారావు ప్రాంభించారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యం దృష్యా పట్టణ పరిశ్రుభత అధికా రులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కౌన్సిలర్ల ఘర్షణ..

మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఇద్దరు కౌన్సిలర్ల మధ్య ఘర్ష ణ చోటుచేసుకుంది. కౌన్సిలర్లతోపాటు వారి అనుచరులు మధ్య ఘ ర్షణ జరిగింది. కొత్త ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయర మణారావు పక్కన నిలబడేందుకు కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్‌, నూగిళ్ల మల్లయ్య పోటీపడ్డారు. ఎమ్మెల్యే పక్కన నిలబడి ఉన్న శ్రీని వాస్‌ను మల్లయ్య జరగమంటూ చెప్పడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో ఎమ్మెల్యే ఇద్దరికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం కార్యాలయంలో జరిగే బడ్జెట్‌ సమావేశంలో పాల్గొనేం దుకు ఎమ్మెల్యే, కౌన్సిలర్లు వెళ్లిపోయారు. కౌన్సిలర్ల అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సమావేశం జరుగుతుండగా కార్యా లయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డు కున్నారు. సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు రాగానే ఇరువ ర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే నచ్చజెప్పినా ఇరువర్గాలు వినకపోవడంతో, పోలీసులు ఎమ్మెల్యేను అక్కడినుంచి పంపించిన అనంతరం లాఠీచార్జి చేశారు. అనంతరం ఇద్దరు కౌన్సి లర్లు వేర్వేరుగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 12:11 AM