Share News

మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు..

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:37 PM

వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహ నం నడుపరాదని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ మసూద్‌ అలీ అన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు..

పెద్దపల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహ నం నడుపరాదని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ మసూద్‌ అలీ అన్నారు. రోడ్డు భద్ర త వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని వ్యాన్‌డ్రైవర్స్‌, ఓనర్స్‌ అసోసియేషన్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎంవీఐ మసూద్‌ అలీ మాట్లాడుతూ వాహనదారులు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు తప్పని సరిగా వెంట ఉంచుకోవాలని, డ్రైవర్‌లకు లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. వాహనాలు నడిపేటపుడు సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ మధు, ఉమర్‌ పరూఖ్‌తోపాటు వ్యాన్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బూత్కురి తిరుపతి, మహ్మద్‌ ఆరీఫ్‌ అలీ, రఘు, సదయ్య, స్వామి, బాలాజిసింగ్‌, రాజబాబు, మహేందర్‌, ఎండీ ఇర్ఫాన్‌ డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:37 PM