Share News

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:18 AM

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పుకునే పద్ధతిని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగు లు మార్చుకోవాలని, వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దు

కోల్‌సిటీ, జనవరి 8: ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పుకునే పద్ధతిని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగు లు మార్చుకోవాలని, వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జిలను స్వీకరించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు ప్రజావాణి కార్యక్రమం కోసం ప్రత్యేక రిజిష్టర్‌ నిర్వహించా లని, దరఖాస్తుల వివరాలు సదరు రిజిష్టర్‌లో నమోదు చేయాలని, పరిష్కారం అయ్యేవిధంగా విధులు నిర్వహించా లన్నారు. అదే సమస్యపై రెండవ సారి దరఖాస్తు వచ్చే విధంగా ఉండవద్దన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది మర్యదగా ప్రవర్తిం చాలన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణికి ప్రజలు పెద్దఎత్తు న తరలివచ్చి సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. మంథని మండలం బిట్టుపల్లికి చెందిన బండారి అశోక్‌ సర్వే నంబరు372లోని తన రెండు ఎకరాల భూమిని సింగరేణి సేకరించి పరిహారం ఇవ్వడం లేదని దరఖాస్తు చేసుకోగా మంథని ఆర్‌డీవోకు చర్యలకు సిఫార్సు చేశారు. ఎన్‌టీపీసీ నుంచి మేడిపల్లి రోడ్డులో డివైడర్లలో కోనోకార్ఫస్‌ చెట్లు ఉండ డం వల్ల గాలి నాణ్యత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రసాద్‌, రమేష్‌లు కోరగా కమిషనర్‌కు ఆదేశా లు ఇచ్చారు. లక్ష్మీనగర్‌కు చెందిన శంకర్‌ అనే వికలాంగుడు తనకు సద రమ్‌ సర్టిఫికెట్‌ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. తనకు కంటి చూ పునే సమస్యగా చూపుతున్నారని, కాలు తొలగించినా కూడా వికలాంగుడి గా గుర్తించడం లేదన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలంటూ డీఆర్‌ డీఏ అధికారులను ఆదేశించారు. 12వ డివిజన్‌ విఠల్‌నగర్‌కు చెందిన రియాజుద్దీన్‌ రోడ్లు, వీధి దీపాలు, పందుల నివారణపై కలెక్టర్‌కు నివేదిం చారు. అలాగే బేగంపేటలోని హజరత్‌ పీర్‌ పహాడి దర్గాకు దారిని, అట వీశాఖకు చెందిన భూమిని రైతులు కబ్జా చేశారని, దీంతో దర్గాకు వెళ్లే దారిలేకుండా పోయిందని, దర్గాకు దారి ఇప్పించాలని కోరారు. అలాగే 5వ డివిజన్‌కు చెందిన రహీం5వ డివిజన్‌ సమస్యలను పరిష్కరించాలని, మల్కాపూర్‌ రహదారిని నిర్మించాలని కోరారు. మద్దెల దినేష్‌ అనే వ్యక్తి కరకట్ట నిర్మాణం, విఠల్‌నగర్‌ మార్కెట్‌ నిర్వహణ పనుల గురించి అధికా రులను కోరారు. ఎన్‌టీపీసీ ఎస్‌బీఐ నుంచి మేడిపల్లి సెంటర్‌ వరకు సర్వీస్‌ రోడ్డు నిర్మించాలని కార్పొరేటర్‌ కొలిపాక సుజాత కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ నాగేశ్వర్‌, తహసిల్దార్‌ కుమా రస్వామి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:19 AM