Share News

మోతాదుకు మించి సౌండ్‌ పెట్టొద్దు

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:13 AM

గోదావరిఖని సబ్‌డివిజన్‌లోని డీజే ఆపరేటర్లు ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో మోతాదుకు మించి శబ్దంతో డీజేలు ఆపరేటర్‌ చేయవద్దని, అలాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌ పేర్కొ న్నారు.

మోతాదుకు మించి సౌండ్‌ పెట్టొద్దు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 12: గోదావరిఖని సబ్‌డివిజన్‌లోని డీజే ఆపరేటర్లు ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో మోతాదుకు మించి శబ్దంతో డీజేలు ఆపరేటర్‌ చేయవద్దని, అలాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌ పేర్కొ న్నారు. శుక్రవారం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివి ధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని డీజే ఓనర్లు, ఆపరేటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఏదైనా కార్యక్రమానికి డీజే పెట్టాలంటే పోలీస్‌ స్టేషన్ల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, రాత్రి 10గంటలలోపు కార్యక్రమాన్ని ముగించాలన్నారు. 60 నుంచి 80డిసిబుల్స్‌ కన్నా శబ్దం ఎక్కువ ఉండవద్దని, కొందరు 130 నుంచి 150డిసిబుల్స్‌ సౌండ్‌ పెడుతున్నారన్నారు. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు, హార్ట్‌ఎటాక్‌ వచ్చే ప్రమాదముందన్నారు. డీజే ఓనర్లు, ఆపరేటర్లు ఇకనుంచి మోతా దుకు మించి సౌండ్‌ పెట్టవద్దని, సమయపాలన పాటించాలని సూచించారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమం లో గోదావరిఖని వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, టుటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ బీ రవీం దర్‌, రామగుండం, మంథని ఇన్‌స్పెక్టర్లు అజయ్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:13 AM