Share News

ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:50 PM

జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తన బృందంతో తనిఖీ చేశారు. జిల్లా రిజిస్ట్రేషన్‌ ఆక్ట్‌ ప్రకారం బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర పత్రాలను పరిఽశీలించారు.

ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

సుభాష్‌నగర్‌, జూలై 5: జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తన బృందంతో తనిఖీ చేశారు. జిల్లా రిజిస్ట్రేషన్‌ ఆక్ట్‌ ప్రకారం బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర పత్రాలను పరిఽశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు(అల్లోపతి, ఆయుష్‌, యూనాని, సిద్ద) తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆక్ట్‌ 2010 ప్రకారం నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీస్‌ భాషల్లో ధరల పట్టిక బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. అంతేకాకుండా డాక్టర్ల వివరాలు, సిబ్బంది వివరాలు ప్రదర్శించాలన్నారు. ఆసుపత్రి వ్యర్థాలను బయోమెడికల్‌ వేస్టేజ్‌ మేనేజ్‌మెంట్‌ వారికి ఇస్తే నిభందనల ప్రకారం, శాస్త్రీయ పద్దతిలో వ్యర్థాలను నిర్మూలిస్తారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లేని ఆసుపత్రులు, స్కానింగ్‌ సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jul 05 , 2024 | 11:50 PM