Share News

జిల్లాకు రూ. 30 కోట్లు

ABN , Publish Date - Feb 05 , 2024 | 01:10 AM

జగిత్యాల జిల్లాకు ప్రత్యేక అభి వృద్ధి నిధి (ఎస్‌డిఎఫ్‌) నిధులు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మె ల్యేల విజ్ఞప్తులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున జిల్లాలో ని మూడు నియోజకవర్గాలకు రూ. 30 కోట్లు కేటాయిస్తూ జీవో నం. 22 జారీ చేసింది.

జిల్లాకు రూ. 30 కోట్లు

- ఎస్‌డీఎఫ్‌ నిధుల వినియోగ బాధ్యత ఇన్‌చార్జి మంత్రికి

- ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 10 కోట్ల చొప్పున కేటాయింపు

- వచ్చే నెలాఖరు వరకు వ్యయం చేయడానికి అవకాశం

- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

జగిత్యాల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాకు ప్రత్యేక అభి వృద్ధి నిధి (ఎస్‌డిఎఫ్‌) నిధులు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మె ల్యేల విజ్ఞప్తులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున జిల్లాలో ని మూడు నియోజకవర్గాలకు రూ. 30 కోట్లు కేటాయిస్తూ జీవో నం. 22 జారీ చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన పూర్తి బాధ్యత లను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి అప్ప గించింది. ఈ నిధులను మార్చి 31వ తేదీ లోగా ఖర్చు చేసేందుకు అవకా శం కల్పించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనల ను ఎమ్మెల్యేలు సంబంధిత అధికారుల ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రికి నివేదించాల్సి ఉంటుంది. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశాల మేరకు వాటిని వెచ్చించాలి. ఈ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మె ల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టే పనుల ప్రతిపాదనల తయారీ కసరత్తులో నిమగ్నమయ్యారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి ఎమ్మెల్యేలు డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, అడ్లూ రి లక్ష్మణ్‌ కుమార్‌లు ఇప్పటికే సంబందిత నిధుల వినియోగంపై దృష్టి సారించారు.

ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోజనం...

ఎస్‌డీఎప్‌ నిధుల వినియోగంలో ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతిచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు కేటాయించిన రూ. 10 కోట్లలో రూ. 2 కోట్లను ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలని ఆదేశించింది. మరో కోటి రూపాయలను అ సెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్క రించేందుకు వెచ్చించాలని సూచించింది. మరో రూ. 50 లక్షలను కలెక్టర్‌, జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం వినియోగించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలు, తాగు నీరు, కార్యాలయాల నిర్వహణకు సంబంధించి రూ. 3.5 కోట్లు పోగా మిగి లిన రూ. 6.5 కోట్లను తమ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యేలకు సూచించింది. ఈ నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నిధులతో చేపట్టిన పనులు పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక తనిఖీలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. తద్వారా నాణ్యత ప్రకారం గానే జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యేల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేలు అడగకుండానే....

సాధారణంగా ఎస్‌డీఎప్‌ నిధులను ఎమ్మెల్యేలు విజ్ఙప్తుల మేరకే ప్రభు త్వం విడుదల చేస్తోంది. తమ నియోజకవర్గ పరిధిలో ఫలానా పనులు చేపట్టాల్సి ఉందని, అందుకు ప్రత్యేక నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే లు సీఎంను కోరితే అందుకనుగుణంగా నిధులు విడుదలయ్యేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు తెలంగాణ సర్కారులో సైతం ఇలాగే జరిగే ది. కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యేలకు అడ గకుండానే ఒక్కొక్క నియోజకవర్గానికి రూ. 10 కోట్లు చొప్పున నిధులను కేటాయించింది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో విపక్ష పార్టీకి చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తుండగా, ధర్మపురి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిత్యం వహిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సైతం తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చేప ట్టేందుకు వీలుగా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

కొత్తగా చేపట్టే పనులకు ఎస్‌డీఎఫ్‌...

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలతో పాటు కరీం నగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండ లాలు, సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్‌, బీమారం మండలాల్లో కొత్తగా చేపట్టబోయే పనులకు మాత్ర మే ఎస్‌డీఎఫ్‌ నిధులను కేటాయించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులు ఇంతకు మందు ఏ పథకం కింద చేసి ఉండకూడదని స్పష్టం చేసింది. ఆయా ఎమ్మెల్యేల సమన్వయంతో ప నులను ప్రతిపాదించి ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నీరు రాని గ్రామాల సర్వే...

జిల్లాలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వ హించాలని ఇటీవల అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సం బంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసిన ట్లుగానే పక్కాగా తాగునీరు అందని అవాసాల జాబితాను సిద్ధం చేయా లని సూచించారు. జలజీవన్‌ మిషన్‌ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతి పాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించడానికి కసరత్తులు చేస్తు న్నారు. అత్యవసరమైన ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా ఎస్‌డీఎఫ్‌ నిధులను కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతు న్నాయి. అదేవిదంగా రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించడానికి, అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి.

ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్లు వచ్చాయి

- పూర్ణచందర్‌, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్లు కేటాయిస్తూ ఎస్‌డీఎఫ్‌ నిదులు విడుదల చేసింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పనులు ప్రతి పాదించాల్సి ఉంటుంది. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు నిధుల కేటాయింపు జరిగింది. నిధుల వినియోగం చేయడానికి అవసరమైన కసరత్తులు జరుగుతున్నాయి.

Updated Date - Feb 05 , 2024 | 01:10 AM