Share News

అస్తవ్యస్తంగా రోడ్డు విస్తరణ పనులు

ABN , Publish Date - May 24 , 2024 | 12:15 AM

వీణవంక-జమ్మికుంట మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. వీణవంక జమ్మికుంటకు నాలుగు వరుసల రోడ్డు కోసం 2016లో నిధులు మంజూరయ్యాయి.

అస్తవ్యస్తంగా రోడ్డు విస్తరణ పనులు

వీణవంక, మే 23: వీణవంక-జమ్మికుంట మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. వీణవంక జమ్మికుంటకు నాలుగు వరుసల రోడ్డు కోసం 2016లో నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జమ్మికుంట నుంచి వల్బాపూర్‌ గ్రామం వరకు రోడ్డు వేసి మిగిత పనులు వదిలి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీణవంక నర్సింగాపూర్‌ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 29 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. దీంతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు నెలలు గడిచినా పదిశాతం పనులు కూడా పూర్తికాలేదు. ప్రతియేటా వర్షకాలంలో నర్సింగాపూర్‌ వీణవంక గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేయక పోవడంతో రోడ్డు పై నుంచి నీరు పారుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా నాణ్యతలేని మట్టి పోస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. రోడ్డు వంద ఫీట్ల మేర నిర్మించాల్సి ఉండగా ఓక్కో చోట ఓక్కో రకంగా పనులు చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులను పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2024 | 12:15 AM