మల్లన్న జాతరకు కిక్కిరిసిన భక్తులు
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:25 AM
జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం భ్రమరాంబ శ్రీ మల్లికా ర్జునస్వామి క్షేత్రానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఓదెల, జూన్ 16 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం భ్రమరాంబ శ్రీ మల్లికా ర్జునస్వామి క్షేత్రానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రోహిణి కార్తె ముగిసిపోయి మృగశిర కార్తెలో వర్షాలు కురవక పోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. దీంతో భక్తులు తమ మొక్కులను అప్పగించేందుకు వివిధ జిల్లాల నుంచి తరలిరావడంతో జాతర ప్రాం గణం, పరిసరాలన్ని కూడా కిక్కిరిసిపోయాయి. కోడె మొక్కులను, పట్నాలను, బోనాలు తదితర మొక్కులను సమర్పించారు. బండారి పోచమ్మ, మదన పోచమ్మ తల్లుల వద్ద మహిళలు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అధిక సంఖ్య లో భక్తులు తరలిరావడంతో తీవ్రమైన ఎండలకు సైతం భక్తులంతా వేచి ఉండి ఇబ్బందులకు గురయ్యారు.