Share News

మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:47 AM

తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటైన ఓదెల మల్లన్న ఆలయా నికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు

ఓదెల, జూన్‌ 9 : తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటైన ఓదెల మల్లన్న ఆలయా నికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భానుడు శాంతించడంతో వరంగల్‌, భూపాలప ల్లి, మంచిర్యాల, సిద్దిపేట్‌ జిల్లాల నుంచి భక్తులు దర్శనానికి అధికంగా తరలివచ్చా రు. జాతరలోభక్తుల రద్దీ పెరగడంతో పట్నాలు వేయించేందుకు ఒగ్గు పూజారులే సరిపోలేదు. దీంతో క్రమ పద్ధతిలో ఒగ్గు పూజారులు ఆలస్యంగానైనా పట్నాలు వేశా రు. అలాగే భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూ లైండ్లల్లో రెండు గంటలపాటు వేచిఉన్నారు. అలాగే మల్లన్నకు బోనా లు, కోడెల మొక్కలు, ప్రదక్షిణలు, పట్నాలు వేయించి, మదన పోచమ్మ, బంగారు పోచమ్మ, రామాలయంలో మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్ని కిక్కిరిసిపోయాయి. వాహనాలకు పార్కిం గ్‌ స్థలం లేకపోవడం వల్ల మళ్ళీ భక్తులు వంటలు చేసుకునే వద్దనే తమ వాహనా లను నిలుపుకోవడంతో మిగతా భక్తులకు స్థలంలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్షేత్రంలో పూనకాలతో శివసత్తుల కేరింతలు ఉగ్గు పూజారుల డమరుక నాదాలతో తోఆలయ ప్రాంగణం అంతా భక్తిపారవశ్యంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి.

Updated Date - Jun 10 , 2024 | 12:48 AM