Share News

‘ఎయిర్‌పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి’

ABN , Publish Date - Mar 13 , 2024 | 12:28 AM

భారత ప్రధాని నరేంద్రమోదీ రైల్వే స్టేషన్లను ఎయిర్‌ పోర్టులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు.

‘ఎయిర్‌పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి’

కరీంనగర్‌రూరల్‌, మార్చి 12: భారత ప్రధాని నరేంద్రమోదీ రైల్వే స్టేషన్లను ఎయిర్‌ పోర్టులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని రైల్వే స్టేషన్‌లో వన్‌స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో పలు అభివృద్ధి పనులను వర్చువల్‌ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించగా కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌లో స్థానిక నాయకులు, రైల్వే అఽధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌లో ఉత్పత్తి స్టాళ్ల ప్రారంభం కార్య క్రమం చేపట్టారన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని రైల్వేలను ఎంతో ఆధునీకరిస్తున్నా రన్నారు. ప్రయాణికుల కోసం బుల్లెట్‌ రైలు, వందేభారత్‌రైళ్లు తీసుకువచ్చిన ఘనత బీజేపీ మోదీ ప్రభుత్వానిదేనన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లలను తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈకార్య క్రమంలో రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ రవీందర్‌, అడిషనల్‌ ఇంజనీర్‌ నవీన్‌ కుమార్‌, వెల్ఫేర్‌ ఇన్స్‌పెక్టర్‌ విష్ణు, కమర్షియల్‌ సూపర్‌వైజర్‌ యు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2024 | 12:28 AM