Share News

రూ.26.49 కోట్లతో పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:14 AM

అమృత్‌ భారత్‌ పథకంలో భా గంగా 26 కోట్ల 49 లక్షల రూపాయల అంచనాతో చేపట్టనున్న పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా రిమోట్‌తో శంకుస్థాపన చేయనున్నారు.

రూ.26.49 కోట్లతో పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

పెద్దపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అమృత్‌ భారత్‌ పథకంలో భా గంగా 26 కోట్ల 49 లక్షల రూపాయల అంచనాతో చేపట్టనున్న పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా రిమోట్‌తో శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్త పల్లి- కొలనూర్‌ మధ్య ఎల్‌సీ 35వ గేట్‌ ఉప్పరపల్లి వద్ద నిర్మించిన రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జిని కూడా ప్రారంభించనున్నారు. అమృత్‌ భారత్‌ పథ కం రెండో దశలో దేశవ్యాప్తంగా 554 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పెద్దపల్లి స్టేషన్‌ ఉండడం గమనార్హం. మొదటి దశలో జిల్లాలోని రామగుండం, కరీంనగర్‌ రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు మం జూరుచేయగా, ఆ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మోదీ గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ను రెండో దశ లో చేర్చినప్పటికీ, ఆరు మాసాల నుంచే ఇక్కడ పనులు నడుస్తున్నాయి. మరో ఆరు మాసాల్లో పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారనున్నాయి.

Updated Date - Feb 25 , 2024 | 12:14 AM