కేజీబీవీ పాఠశాలను సందర్శించిన డీఈవో
ABN , Publish Date - Dec 13 , 2024 | 11:51 PM
మానకొండూర్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్‌రావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్‌ను పరిశీలించారు.
తిమ్మాపూర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మానకొండూర్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్‌రావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్‌ను పరిశీలించారు. భోజనం చేస్తున్న విద్యార్ధులతో మాట్లాడారు. మెనూ అమలు గురించి తెలుసుకున్నారు. ధర్నాలో పాల్గొంటున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను తెలుసుకున్నారు. వంట సిబ్బందితో ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని. వంటకు ఉపయోగించే నీరు నిలువ ఉండే నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, శుభ్రం చేసిన తేదీని ట్యాంకు మీద ప్రదర్శించాలని ఆదేశించారు. టీచింగ్ స్టాఫ్ ధర్నాలో పాల్గొంటున్న నేపధ్యంలో విద్యార్ధులకు తరగతుల నిర్వహణ విషయంలో ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా వేరే ఉన్నత పాఠశాలల నుంచి మహి ళా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మధుసూధనా చారి, జిసిడివో కృపారాణి పాల్గొన్నారు.