Share News

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించండి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:47 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించండి
సిరిసిల్లలో మాట్లాడుతున్న స్కైలాబ్‌బాబు

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 25: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని పదేళ్లు పాలించిన బీజేపీ ప్రజలపై పెను భారం మోపిందన్నారు. బడా కార్పొరేట్లకు వరాలు ఇచ్చిందని, మత విధ్వేషాలు రెచ్చగోట్టిందని అన్నారు. 2014లో అధికా రంలోకి వచ్చే ముందు నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లో ఉన్న నల్ల ధనాన్ని 100 రోజుల్లో తెచ్చి దేశ ప్రజల ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున జమ చేస్తామని ప్రకటించారని, పదేళ్లు గడుస్తున్నా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పెను భారాలతో పేద మధ్యతరగతి ప్రజలను నడ్డి విరిచారన్నారు. అంబానీ అధాని వంటి కార్పొరేట్‌ శక్తుల ఆదాయం పెంచే విధంగా లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారన్నారు. నేటికి పంట లకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలు గు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చారని, పెట్టుబడి దారులకు ఉడిగం చేస్తున్నారని మండిపడ్డారు. దళితలు, గిరిజనులు బలహీన వర్గాలపై బీజేపీ పాలనలో దాడులు దౌర్జన్యాలు పెరి గాయన్నారు. బీసీ ప్రధానినని చెప్పుకుంటున్న నరేంద్రమోదీ బీసీ కలగణన ఎందుకు చెపట్టలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌లకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ స్కాం రూ.100 కోట్లు మాత్రమేనని, ఎలక్టోరల్‌ బాండ్స్‌ అవినీతి రూ.12 వేల కోట్లకు చేరిందని, అందులో బీజేపీ రూ.678 కోట్ల అవినీతికి పాల్ప డిందని ఆరోపించారు. బీజేపీని మించిన అవినీతి పార్టీ మరొకటి లేదన్నారు. బీజేపీని ఓడించి దేశాన్ని కాపాడాల న్నారు. ఐదు సంవత్సరాలుగా కరీంనగర్‌ పార్లమెంటు సభ్యు డిగా ఉన్న బండిసంజయ్‌కుమార్‌ సిరిసిల్ల ప్రాంతానికి ఏ ఒక్క చిన్న పనీ చేయలేదన్నారు. ఇక్కడి ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. ఐదేళ్లలో ఐదుసార్లు కూడా ఆయన సిరి సిల్లలో పర్యటించలేదన్నారు. జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్గి, కోడం రమణ, ఎరవెళ్లి నాగరాజు, ముక్తికాంత అశోక్‌, సూరం పద్మ, శ్రీరాం సదానందం, అన్నల్‌దాస్‌ గణేష్‌, నక్క దేవదాస్‌, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి చూపించాలి

నేతన్నలకు ప్రభుత్వం తక్షణమే ఉపాధి చూపించాలని, ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వార్ఫిన్‌ కార్మికుడు అడిచెర్ల సాయి మృతదేహాన్ని గురువారం సాయంత్రం పరిశీలించి కుటుంబసభుయలను పరామర్శించారు. నేత కార్మికులు సాయి, అంకారపు మల్లేశం ఆత్మహత్య చేసు కోవడం బాధాక రమని అవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి రమేష్‌, జిల్లా కమిటీ సభ్యుడు రమణ, జవ్వాజి విమల పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:47 PM