నరసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:01 AM
ధర్మపురి క్షేత్రంలో శనివారంభక్తుల రద్దీ నెలకొంది. లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం స్వామి వారలకు వేదపండితులు ప్రత్యేక పూజలు జరిపారు.
ధర్మపురి, అక్టోబరు 19 (ఆంద్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో శనివారంభక్తుల రద్దీ నెలకొంది. లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం స్వామి వారలకు వేదపండితులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారల నిత్య కల్యాణం, నరసింహ హోమం జరిపించారు. రావి చెట్టు ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టు ప్రదక్షిణాలు చేశారు. ఆలయాలు నరసింహ, గోవింద నామ స్మరణలతో ప్రతి ధ్వనించాయి.
యమ ధర్మరాజు ఆలయంలో అభిషేకం
ఽధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ యమ ధర్మరాజు ఆలయంలో శనివారం స్వామి వారలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భరణి నక్షత్రం సందర్భంగా ఆలయ వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు స్వామి వారికి రుద్రాభిషేకం, ఆయుష్యసూక్తం, యమసూక్త పూర్వక అభిషేకం, హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. అప మృత్యు నివారణ కోసం అర్చకులు పూజలు నిర్వహించారు. రాత్రి వరకు భక్తులు గండ దీపంలో నూనె పోసి స్వామి వారలను దర్శనం చేసుకున్నారు. - దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ పూజలు
ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ ఎం రామక్రిష్ణారావు కుటుంబసమేతంగా శనివారం సందర్శించారు. వేదపండితులు, అర్చకులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, అర్చకులు ఆశీర్వదించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ వారికి స్వామి శేష వస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్‌తదితరులు పాల్గొన్నారు.