రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - May 27 , 2024 | 12:30 AM
వేములవాడ రాజ రాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
వేములవాడ టౌన్, మే 26: వేములవాడ రాజ రాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తర లివచ్చిన భక్తులు ఆలయ కల్యాణకట్టలో తల నీలా లు సమర్పించి ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. కోడెమొక్కుల క్యూలైన్‌లో సుమారు రెండు గంటలపాటు నిరీక్షించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు.