Share News

బీజేపీ అధికారంలో ఉంటేనే దేశానికి రక్షణ

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:40 PM

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశా నికి రక్షణగా ఉంటుందని బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌ అన్నారు.

బీజేపీ అధికారంలో ఉంటేనే దేశానికి రక్షణ

పెద్దపల్లి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశా నికి రక్షణగా ఉంటుందని బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌ అన్నారు. శనివారం పెద్ద పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద పల్లి బీజేపీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, తమదంతా ఒకటే మోదీ వర్గం అని అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్క రు కష్టపడాలని అన్నారు. వివేక్‌ వెంకటస్వామి కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇవ్వడం కాంగ్రెస్‌లో కుటుంబ పాలనకు తెరలేపిందని విమర్శించారు. వివేక్‌ ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో వ్యాపారాలు పెట్టి ఆర్థికంగా ఎదుగుతున్నారని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు ఇక్కడ ఎలాంటి పరిశ్రమలను నెలకొల్పకుండా యువ తకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి పార్లమెంట్‌ ప్రాంతాన్ని వివేక్‌ ఒక రాజరిక వ్యవస్థగా మార్చుకున్నారని విమర్శించారు. ఇక్కడి ప్రజలను మోసం చేసి ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని, చెన్నూర్‌ నియోజకవర్గంలో పంట లు నష్టపోయిన రైతుల గురించి వివేక్‌ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఒక డెంగ్యూ లాగా వివేక్‌ కుటుంబం ఈ ప్రాంతానికి శాపంగా మారిందన్నారు. రాజకీయ దోపిడీ కి పాల్పడుతున్న వివేక్‌ కుటుంబాన్ని తరిమి కొట్టాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీ కృష్ణకు దళితులు, రైతుల పట్ల అవగాహన లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసింది లేదన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే దేశానికి రక్షణ అని అన్నారు. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత రైతులకు కన్నీళ్లు మిగిల్చారన్నారు. ఉమ్మడి కరీం నగర్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు మీస అర్జున్‌ రావు, పార్టీ నాయకులు ఠాగూర్‌ రాంసిం గ్‌, ఆది కేశవరావు, పిన్నింటి రాజు, కొంతం శ్రీనివాసరెడ్డి, పండ్యాల కుమార్‌, వెల్లంప ల్లి శ్రీనివాసరావు, పర్స సమ్మయ్య, పల్లె సదానందం, జంగ చక్రధర్‌ రెడ్డి, అక్కేపల్లి క్రాంతి, పెండ్యాల రమేష్‌, కరుణాకర్‌, తుడి రవీందర్‌, రమేష్‌, మనోహర్‌, రవీందర్‌, రమేష్‌, తూముల మల్లారెడ్డి, మంతెన కృష్ణ, నారాయణస్వామి, జగన్‌, ఎల్లంకి రాజేందర్‌, సంపత్‌, శ్రీనివాసమూర్తి, ఆనంద్‌, లక్ష్మణ్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:40 PM