Share News

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రారంభించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 12:15 AM

జూన్‌ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో పార్లమెంట్‌ ఎన్నిక ల కౌంటింగ్‌ను ఆరంభించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఆదేశించారు.

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రారంభించాలి

పెద్దపల్లి, మే 28 (ఆంధ్ర జ్యోతి): జూన్‌ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో పార్లమెంట్‌ ఎన్నిక ల కౌంటింగ్‌ను ఆరంభించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఆదేశించారు. మంగ ళవారం ఆయన ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలి సి కౌంటింగ్‌ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 4న నిర్వహించు పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ వారీగా కౌంటింగ్‌ హాల్‌లో నిర్దేశిత రౌండ్ల వారీగా కౌంటింగ్‌ కట్టుదిట్టంగా పూర్తి చేయాలని, ప్రతి రౌండ్‌ ముగిసిన తర్వాత సంబంధిత టేబుల్‌ ల కౌంటింగ్‌ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని అన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలె ట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారం భించాలని అన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది, కౌంటింగ్‌ ఏజెంట్లు కౌంటింగ్‌ హాల్లోకి ఎటువంటి ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్‌ తీసుకొని వెళ్లడానికి వీలులేదని అన్నారు. ప్ర తి కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఫలితాలు ప్రకటించేందుకు ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నా రు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలను పరిశీలించి కౌంటింగ్‌ నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు ధృవీకర ణ పత్రం సమర్పించాలని రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఏఆర్‌ఓలు అరుణశ్రీ, బి గంగయ్య, హనుమానాయక్‌, పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:15 AM