రామగుండం నగరాభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:36 AM
గ్రామ పంచాయతీ స్థాయ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎది గిన రామగుండం నగర అభివృ ద్ధికి సింగరేణి కార్మికులు, ప్రజ లు సహకరించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్ల య్య, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి విజ్ఞప్తి చేశారు.
గోదావరిఖని, జూలై 14: గ్రామ పంచాయతీ స్థాయ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎది గిన రామగుండం నగర అభివృ ద్ధికి సింగరేణి కార్మికులు, ప్రజ లు సహకరించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్ల య్య, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి విజ్ఞప్తి చేశారు. ఆదివా రం స్థానిక భాస్కర్‌రావు భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడు తూ రామగుండం కార్పొరేషన్ లో జనాభా పెరిగిందని, దానికి తగ్గట్టుగా అభి వృద్ధి జరుగాలన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు ధీటుగా రామగుండం నగరంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదే శాల మేరకు హనుమాన్‌నగర్, శివాజీనగర్, లక్ష్మీనగర్ ఏరియాలో 82క్వార్టర్లను తొలగించా ల్సి వస్తుందని, దీనికి కార్మికులు సహకరించా లని కోరారు. కొంతమంది తమ స్వార్థం కోసం క్వార్టర్లలో నివాసముంటున్న కార్మికులను రెచ్చ గొడుతున్నారని, కొంత మంది అనధికారికంగా సింగరేణేతరులు, పదవీ విరమణ పొందిన వారు ఉంటున్నారని, వారు ఎప్పటికైనా క్వార్ట ర్లను ఖాళీ చేయాల్సిందేనన్నారు. కొంత మంది గుర్తింపు సంఘాన్ని బదనాం చేయడానికి అర్థ రహితమైన విమర్శలు చేస్తున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నగరం జనా భా, అసవరాలకు తగిన విధంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందు కోసం కొంత కష్టనష్టాలు ఉంటాయని, కార్మికులు అవి భరించాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. కొంతమంది స్వార్థం కోసం పట్టణాభి వృద్ధిని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లడం సరైంది కాదని, గతంలోనే క్వార్టర్లు ఖాళీ చేయాల ని సింగరేణి యాజమాన్యం నోటీ సులు ఇచ్చిందని చెప్పారు. రోడ్డు వెడల్పులో క్వార్టర్లు కోల్పోతున్న కార్మికులకు ఎలాంటి కౌన్సెలింగ్ లేకుండా సెక్టార్-1 ఏరియాలో వారికి క్వార్టర్లను కేటాయింఆచలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు క్వార్టర్లు తీసుకునే వరకు విద్యుత్, నీటి కనె క్షన్లను తొలగించవద్దని విజ్ఞప్తిచేశా రు. కొంత మంది క్వార్టర్లతో లబ్ధి పొందుతున్న వారు కార్మికులకు మాయమాట లు చెప్పి మభ్యపెడుతున్నారని, వారి మాటల ను నమ్మవద్దని, నగర అభివృద్ధికి సహకరిం చాలని, ఏఐటీయూసీ కార్మికుల పక్షాన ఉండి వారి సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, మిట్ట శంకర్, శ్రీనివాష్, భాస్కర్, అనీల్, రమేష్, ప్రకాష్, శ్రీనివాస్, తొడుపునూరి రమేష్, లక్ష్మీనారాయణ, వెంక టేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.