Share News

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:56 AM

తనను ఆదరించి గెలిపించిన వేములవాడ నియోజకవర్గ అభివద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ప్రభుత్వ విప్‌, ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా
సమావేశంలో మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌

వేములవాడ టౌన్‌, జనవరి 7 : తనను ఆదరించి గెలిపించిన వేములవాడ నియోజకవర్గ అభివద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ప్రభుత్వ విప్‌, ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని రుద్రవరం గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముంపు గ్రామాల సమస్యలు తెలిసిన వాడిగా 14 సంత్సరాలుగా పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ సమస్య తన దృష్టిలో ఉందని, నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సైతం నిర్వాసితుల సమస్యలు తెలుసని, వారు సైతం నిర్వాసితుల ఆందోళనల్లో పలు మార్లు భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షల పెంచామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని వివరించారు. ఎన్నికలు జరిగే వరకే రాజకీయాలని, అభివృద్ధిలో మాత్రం అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఆది శ్రీనివాస్‌కు గ్రామస్థులు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్‌, నేతాజీ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంటు, ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు వంట గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రవ్వబాబు, జడ్పీటీసీ మ్యాకల రవి, సర్పంచ్‌ ఊరడి రాంరెడ్డి, ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణస్వామి, సింగిల్‌ విండో చైర్మన్‌ రేగులపాటి కృష్ణదేవరావు, ఉపసర్పంచ్‌ తాడెం శ్రీనివాస్‌ యాదవ్‌ మాజీ సర్పంచ్‌ పిల్లి కనుకయ్య, కత్తి కనుకయ్య, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరి మున్నూరుకాపు సత్రంలో తూర్పువాడ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విఫ్‌ ఆది శ్రీనివాస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించిన సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాజన్న ఆలయ చైర్మన్‌గా చేసిన వ్యక్తులు రాజకీయాల్లో రాణించలేరని దుష్పాచారం చేశారని, ఎమ్మెలేగా గెలవడంతో అపోహలు పటాపంచలయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ దేవయ్య, బింగి మహేష్‌, చిలుక రమేష్‌, కూరగాయాల కొమురయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:56 AM