కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలన్నదే కాంగ్రెస్ కుట్ర
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:56 PM
కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలన్నదే కాంగ్రెస్ కుట్ర అని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు.

పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 3: కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలన్నదే కాంగ్రెస్ కుట్ర అని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. బుధవారం బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యిందన్నారు. ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టు పనికి రాదని మాట్లాడటం అవివేకమన్నారు. ఒక్క పిల్లర్ కుంగిపోతే మనిషి వెన్నెముఖ పోయినట్లేనని, ఇక మనిషి జీవితం ఎలా పనికి రాదో అదే రీతిలో ప్రాజెక్టు పనికి రాదని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. మనిషి వెన్నె ముక పోతే సాంకేతిక పరిజ్ఞానంతో వెన్నెముఖను ఏర్పాటు చేసి నడిపించే రోజులు ఉన్న క్రమంలో పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరమన్నారు. పూ ర్వం గ్రామాల్లో చెరువు కట్ట, తూము, మత్తడికి గండి పడితే ఇసుక సంచులు వేసి కాపాడుకున్నామని, అదే రీతిలో ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగిపోతే తాత్కాలిక మర మ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉండగా ప్రాజెక్టు పనికి రాదంటూ నీళ్లు లేకుండా చేసి రైతులను ఆగం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చెరు వులను కాపాడామని, ఇసుక బస్తాలువేసి నీళ్లను మళ్లీంచామని తెలిపారు. భావిత రాల భవిష్యత్ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని ఆయన గుర్తుచేశారు. మంచి పాలన అందిస్తారని ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి అధికారం ఇస్తే రైతులను అరిగోస పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు ఇవ్వ కుండా ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా రైతు బంధు సకాలంలో ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి రైతులను ఆగం చేస్తున్నారని ఆయన ఆరోపిం చారు. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇవ్వలేదని, ఎన్ని ఎకరాలకు ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో ఇంకా సుమారు ఎని మిది వేల మంది రైతులకు రైతుబంధు రావాల్సి ఉందని చెప్పారు. పంటలకు సాగు నీరు ఇవ్వకుండా, రైతుబంధు పైసలు వేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచే స్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పాలకులు అబద్ధాలతో ముందుకు సాగు తున్నారని ఆయన విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టి రైతు లకు నష్టం చేసిన పాలకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో రఘువీర్‌సింగ్, పూదరి సత్యనారాయణ పాల్గొన్నారు.