Share News

ఎన్టీపీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అండ

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:42 PM

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు.

ఎన్టీపీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అండ

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 25 : ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. గురు వారం ఎన్టీపీసీ ప్లాంటు వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభలో మక్కాన్‌సింగ్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీపీసీ కార్మికుల కోసం జీవో 22ను అమలుచేయిస్తామన్నారు. తాము ప్రకటించిన 5 న్యాయా ల్లో ముఖ్యమైన కార్మిక న్యాయాన్ని అమలుచేసి తీరుతామ ని తెలిపారు. రామగుండం ప్రాంతాన్ని బి కేటగిరి నగరంగా గుర్తించేలా కృషి చేస్తానని, తద్వారా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, బెన్‌ఫిట్లు పెరుగుతాయన్నారు. ప్రధానంగా రామగుండం కార్మికులకు సంబంధించి డిపెండెంట్‌ ఎప్లా య్‌మెంట్‌, మెడికల్‌ టెస్టులు, పోలీస్‌ ఎంక్వైరీ, గేట్‌ పాసుల సమస్యలను పరిష్కరించేలా చూస్తానన్నారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టులో స్థానికులకే ఉపాధి కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో ఎన్టీపీసీ కార్మికు లు తనకు బాసటగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించా రని, వచ్చేనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మక్కాన్‌ సింగ్‌ కోరారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం విెేక్‌, పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మేయర్‌ అనిల్‌ కుమా ర్‌, ఎన్టీపీసీ పట్టణ కాంరె:స్‌ అధ్యక్షుడు ఎం.డి.ఆసీఫ్‌ పాషా, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, మహంకాళి స్వామి, మచ్చకుర్తి రమేష్‌, కొలని వెంకట్‌రెడ్డి, లింగమూర్తి, తూం పద్మ, ఆంజనేయులు, మురళి, రాజేశం, రవి, నర్సింహారెడ్డి, సురేందర్‌, మల్లేశ్‌, అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి : రానున్న పార్లమెంటు ఎన్నికలలో రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ యువతలో మేథో సంపంతిని బయటికి తెచ్చేందుకు క్విజ్‌ ఏర్పాటు చేస్తున్నామని, టెక్నాలజీని దేశానికి అందించింది రాజీవ్‌ గాంధీ అని, కేంద్రంలో అధికారంలోకి రానున్నది కాంగ్రెస్‌ పార్టీయే నని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. గురువారం మండలంలోని జీడినగర్‌లో ఓ ప్రయివేటు పంక్షన్‌ హలులో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గోన్న మక్కాన్‌ ప్రధాని మోడి రాహుల్‌ గాంధీ పట్ల అవలంబిస్తున్న వైఖరి నిరంకుషంగా ఉందని మండిపడ్డాడు. మొన్నటి వరకు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్‌ నేతలు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బస్సు యాత్రలను, పంటపొలాల వెంట తిరుగుతున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని చెప్పిన తెలంగాణ ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని తెలిపారు.రానున్న పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో పోటి చేస్తున్న గడ్డం వంశీని చేతి గుర్తుపై ఓటు వేసి బారి మెజార్టీతో గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గడ్డం వంశీ,చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ (వెంకట స్వామి) మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గోన్నారు. అనంతరం పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి మక్కాన్‌ సింగ్‌ కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతించారు. అబిమానులు వంశీకి నాగలిని బహూకరించి పట్టుశాలు వాలతో సన్మానించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:42 PM