రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:24 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం పత్తిపాక, నర్సింగాపూర్, మల్లాపూర్, కటికనపల్లి, కమ్మరిఖాన్ పేట్, కొత్తూరు, కటికనపల్లి, ధర్మారం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
- ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి చేయాలి
- ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మారం (పెద్దపల్లి రూరల్), అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం పత్తిపాక, నర్సింగాపూర్, మల్లాపూర్, కటికనపల్లి, కమ్మరిఖాన్ పేట్, కొత్తూరు, కటికనపల్లి, ధర్మారం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందు లు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క రైతుకు ఇబ్బంది జరగకుండా బాధ్యత తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ వర్తించని రైతులకు తాను బాధ్యత తీసుకొని రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు.
- ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభం..
ధర్మారంలోని పంచాయతీరాజ్ నూతన అతిథి గృహంలో మండల మహిళ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిర మహిళ శక్తి క్యాంటీన్‌ను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ధర్మపురి నియోజకవర్గంలో తొలిసారిగా ఏర్పాటు అవుతున్న క్యాంటీన్ ద్వారా అతి తక్కువ ధరలకు ఆహార పదార్థాలను పొందడంతో పాటు, మహిళలకు ఉపాధి లభిస్తుందని ఇది సంతోషకరమైన విషయమని అన్నారు. కార్యక్రమంలో ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడియా రూప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగెల లింగయ్య, నంది మేడారం పత్తిపాక సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి ఎంపీడీవో ఐ. ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహమ్మద్ ఆరిఫోద్దీన్, మండల పంచాయతీ అధికారి రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు సోగాల తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు నాయకులు పాల్గొన్నారు.
జూలపల్లి (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధింత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్ష్మణ్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొద్దుల లక్ష్మీనర్సయ్య, దండె వెంకటేశం, ఏవో ప్రత్యూష, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.