Share News

రక్తదానం చేయడానికి ముందుకు రావాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:40 AM

రక్తదానం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని రామ గుండం సీపీ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

రక్తదానం చేయడానికి ముందుకు రావాలి

కోల్‌సిటీ, అక్టోబరు 26: రక్తదానం చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని రామ గుండం సీపీ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర జవాన్లను స్మరించుకుంటూ అక్టోబరు 21నుంచి 31వరకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దానాల్లో అన్నింటికన్నా గొప్పదని రక్తదానమన్నారు. చాలా సంద ర్భాల్లో రక్తం సమయానికి దొరకక చాలా మంది మృత్యువాత పడుతున్నారని, రక్తదానంతో మరొకరికి ప్రాణదానం పోసినట్టు అవుతుందన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదా నం చేయాలని, రక్తదానం చేయడానికి వచ్చిన వాలంటీర్లను ఆయన అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో గోదావరిఖని ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌, టుటౌన్‌ సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు, రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్‌, మంథని సీఐ రాజు, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షు లు పిల్లి మల్లికార్జున్‌, కంజపురం రాజేందర్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:40 AM