క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:31 AM
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేం దుకే సీఎం కప్ పోటీలు నిర్వ హిస్తున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.

సుల్తానాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేం దుకే సీఎం కప్ పోటీలు నిర్వ హిస్తున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. సుల్తానా బాద్ ప్రభుత్వ జూనియర్ కళా శాల మైదానంలో నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి వాలీ బాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల ముగింపు ఉత్సవాలు శనివారం రాత్రి జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో రెండు వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారని, వారి క్రీడా ప్రతిభను చాటుకున్నారని అన్నారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలలో పొల్గోనేలా చేస్తారన్నారు. గతంలో క్రీడల పట్ల అంతగా ఆసక్తి చూపని వారు సైతం సీఎం రేవంత్ రెడ్డి క్రీడారంగానికి ఇస్తున్న ప్రోత్సహం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అసక్తి చూపుతున్నారన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ,నియోజకవర్గం కేంద్రాల్లో స్టేడియా లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించి పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యో గ నియామకాల్లో రెండు శాతం రిజర్వేషన్ వెసులు బాటు ఉంటుందని తద్వారా ప్రభుత్వ కొలువులు కూడా పొందవచ్చన్నారు. జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని విజేతలు గా నిలిచిన క్రీడాకారులకు జట్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశా రు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, మార్కెట్ చైర్మన్ మి నుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీం దర్, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ బిరుదు సమత క్రిష్ణ, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వై సురేష్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీడీవో దివ్య దర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.