Share News

ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్ల గుబులు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:59 AM

వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూ టేష న్ల రద్దు గుబులు నెలకొంది. కొన్నేళ్లుగా పలువురు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది డిప్యూటేషన్‌పై అక్రమంగా పలు ప్రాంతాల్లో విధులు నిర్వహి స్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్ల గుబులు

- ప్రక్షాళన దిశగా సర్కారు అడుగులు

- వివరాలు సేకరిస్తున్న ఉన్నతాధికారులు

- ఉద్యోగులు, వైద్య సిబ్బందిలో ఆందోళన

- త్వరలో వైద్యాధికారులకు తప్పని స్థాన చలనం

జగిత్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూ టేష న్ల రద్దు గుబులు నెలకొంది. కొన్నేళ్లుగా పలువురు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది డిప్యూటేషన్‌పై అక్రమంగా పలు ప్రాంతాల్లో విధులు నిర్వహి స్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ స ర్కారు ఆరోగ్య శాఖలో అక్రమాల ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు అడు గులు వేస్తున్నారు. వైద్యాధికారులు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది డిప్యుటేషన్‌ విధులపై ప్రభుత్వం ఇటీవల దృష్టి సారించింది. జిల్లాలో ఎంత మంది డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు...? ఎంత కాలం నుంచి చేస్తున్నారనే వివ రాలతో జిల్లా వైద్యాధికారులను నివేదిక కోరారు. వైద్య ఆరో గ్య శాఖ మం త్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఈ వివరాలు కోరినట్లు వైద్య అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిబంధనలకు విరు ద్ధంగా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు కోరుకున్న చోటుకు డిప్యుటేషన్‌ పై పోస్టింగ్‌లు ఇచ్చారని ఆరోపణలున్న నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు సమగ్ర నివేదిక కోరినట్టు ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరు వైద్య అధికారుల డిప్యూటేషన్లను ఉన్నతాధికారులు రద్దు చేశా రు. పదుల సంఖ్యలో ఉన్న వైద్యులు, సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేయ కుండా ఒకరిద్దరిని మాత్రమే రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది. వివిధ ప్రాంతాలల్లో పనిచేస్తున్న అధికారులు సంగతేందని పలువురు ప్ర శ్నిస్తున్నారు.

ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్ల జబ్బు....

డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొన్నేళ్లుగా డి ప్యుటేషన్ల జబ్బు పట్టుకున్నది. పోస్టు జీతం ఒకచోట ఉంటే పనిచేసేది మ రోచోట అన్నట్టు ఉన్నది పరిస్థితి. డిప్యూటేషన్లే కాకుండా ఆన్‌డూటీ, వర్క్‌ ఆర్డర్‌ల పేరిట ట్రాన్స్‌ఫర్‌లకుఅధికారులు గతంలో తెరలేపారు. ఇందులో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలో కొన్ని జరగగా, మరికొన్ని జిల్లా స్ఘాయిలో జరి గాయి. ఈ రకంగా జిల్లాలో సుమారు వంద మంది వరకు ఉద్యోగులు, వైద్య సిబ్బంది డిప్యుటేషన్‌ విధులు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికార వ ర్గాలు పేర్కొంటున్నాయి. చాలా మంది వివిధ హోదాల్లో డిప్యు టేషన్‌పై అయిదేళ్లు, కొందరు పదేళ్ల నుంచి కూడా పనిచేస్తున్నారు. వారికి చ్చిన ఆర్డర్లలో కొందరికి గడువు పేర్కొనకపోవడం, మరికొందరికి ఆరు నెలలు, ఒక సంవత్సరం ఇలా కొంత గడువుతో ఉండడంతో వారంతా ఏళ్లుగా అ లాగే పని చేస్తూ వస్తున్నారు. ఇందులో ఇటీవల గడువు ముగిసినా ఒకరి ద్దరు వైద్యుల డిప్యూటేషన్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు..

జగిత్యాల జిల్లాకు చెందినవారు పక్క జిల్లాల్లో, పక్క జిల్లా వారు జగి త్యాల జిల్లాలో పనిచేస్తుండడం గమనార్హం. వీరికి తోడు పలువురు అంత ర్గతంగా జిల్లాలో సైతం ఒక చోట పోస్టింగ్‌ మరో చోట డిప్యూటేషన్‌ విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఆఫీస్‌ సబార్డినేట్‌, అటెండర్‌, డ్రైవర్‌, ఆశా, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సులు, సూపర్‌వైజర్‌, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్ని షియన్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌, డీపీఎంలు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, కొందరు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు...ఇలా అన్ని కేడర్ల ఉద్యోగులు, సిబ్బంది డిప్యూటేషన్‌పై ఉండడం గమనార్హం.

ఉద్యోగులు, వైద్య సిబ్బందిలో టెన్షన్‌..

డిప్యుటేషన్లపై ఉన్నతాధికారులు నివేదిక కోరడంపై వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేసే ఉద్యోగులు, వైద్య సిబ్బందిలో గుబులు మొదలైంది. సొంత స్థానంలోకి తిరిగి వెళ్లాల్సి వస్తదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇ న్నాళ్లు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని అనుకూలమైన ప్రాంతాల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఎవరడుగుతారనే ధీమాతో సేవలు అవస రం లేకున్నా పోస్టే లేని స్థానాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో గతంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందనే ఆరోప ణలున్నాయి. అవినీతి అధికారులను ప్రోత్సహించవద్దని, నిజాయితీగా పని చేసే వారినే జిల్లా, డివిజన్‌, మండల అధికారులు నియమించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులకు కూడా త్వరలో స్థాన చలనం ఉంటుందని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

వైద్య విధాన పరిషత్‌లో విధులు ఇలా...

జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌లో సుమారు 54 మంది స్టాఫ్‌ నర్సులు హైద్రాబాద్‌లోని చుట్టు పక్కల గల వివిధ ప్రాంతాలకు వెళ్లి డిప్యూటే ష న్‌పై పనిచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. జగిత్యాల మెడి కల్‌ కళాశాల జిల్లా నుంచి ఒక ఆర్‌ఎంవో, ఒక జనరల్‌ మెడిసిన్‌, ఒకటి సూపర్‌స్పెషాలిటీ డాక్టర్‌లు ఇతర జిల్లాల్లో డిప్యూటేషన్‌పై వెళ్లారు. అదే విధంగా ఓ డెంటల్‌ డాక్టర్‌ పనిచేస్తున్న స్థలం జగిత్యాల కాగా ఒరిజినల్‌ పోస్టింగ్‌ పెద్దపల్లి, ఓ ఫిజిషిన్‌ పనిచేస్తున్న స్థలం జీహెచ్‌ఎంసీ కాగా జ గిత్యాలలో పోస్టింగ్‌, ఒక కార్డియాలజిస్టు జగిత్యాలలో పనిచేస్తుండగా ఒ రిజినల్‌ పోస్టింగ్‌ నిజామాబాద్‌, ఒక న్యూరోఫిజిషియన్‌ జగిత్యాలలో ప నిచేస్తుండగా ఒరిజినల్‌ పోస్టింగ్‌ నిజామాబాద్‌, ఒక ఎండోకైనాలిస్టు జగి త్యాలలో పనిచేస్తుండగా హైద్రాబాద్‌లో పోస్టింగ్‌, ఒక జనరల్‌ మెడిసిన్‌ జగిత్యాలలో పనిచేస్తుండగా హైద్రాబాద్‌లో పోస్టింగ్‌ కలిగియున్నట్లు తెలు స్తోంది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పోస్టింగ్‌ కలిగియున్న ఒక రేడి యాలజిస్టు రాయికల్‌కు డిప్యూటేషన్‌పై వచ్చి అక్కడి నుంచి జగిత్యాల లో మరో డిప్యూటేషన్‌పై పనిచేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. ఇద్దరు మెట్‌పల్లి, ఇద్దరు కోరుట్ల, ధర్మపురిలో ఎనిమిది మంది, రాయికల్‌లో ఏ డుగురు వైద్యాధికారులు డిప్యూటేషన్‌లో పనిచేస్తున్నారు. ఒకరు జగిత్యాల నుంచి కరీంనగర్‌కు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదా వరిఖని నుంచి ధర్మపురిలో ఒక పిడియాట్రిషిన్‌ డిప్యూటేషన్‌పై పనిచేస్తు న్నారు. తాజాగా మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్న ఓ వైద్యుడి డిప్యూటే షన్‌ను రద్దు చేస్తూ ఒరిజినల్‌ పోస్టు అయిన రాయికల్‌లో పనిచేయాలని ఆదేశిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం ఒక్క వైద్యుని డిప్యూ టేషన్‌ రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇదే విదంగా ఇతర డి ప్యూటేషన్లను రద్దు చేస్తారన్న గుబులు వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో నెలకొంది.

వైద్య ఆరోగ్య శాఖలో ఇలా...

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో సుమారు పది మంది వరకు వర్క్‌ ఆ ర్డర్‌పై పనిచేస్తున్నారు. ఇందులో మల్యాలలో ఒక సూపర్‌వైజర్‌, ఒక పీహెచ్‌ఎం, పెగడపల్లిలో ఒక స్టాఫ్‌ నర్సు, కొడిమ్యాల ఒక సూపర్‌వైజర్‌, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, కోరుట్లలో ఒక స్టాఫ్‌ నర్సు వర్క్‌ ఆర్డర్‌పై పని చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి నుంచి ఒక ఏఎన్‌ఎం దరూర్‌లో వ ర్క్‌ఆర్డర్‌పై పనిచేస్తున్నారు. జిల్లా నుంచి సుమారు 30 మంది వరకు స్టా ఫ్‌ నర్సులను వివిధ జిల్లాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డిప్యూటేషన్‌ అధికారులు, ఉ ద్యోగుల వివరాలు సేకరిస్తుండడం సంబంధిత వర్గాల్లో గుబులు రేపుతోం ది. ఈవిషయమై జగిత్యాల ఆసుపత్రి సూపరెండెంట్‌ డాక్టర్‌ రాములును సంప్రదించగా వైద్యుల డిప్యూటేషన్‌ వ్యవహారాలు ఇతర అధికారులు చూ సుకుంటారని, ఇటీవల ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూ టేషన్ల సమాచారం అడిగినట్లు వినబడిందని తెలిపారు.

ఉన్నతాధికారులకు వివరాలు అందించాము

డాక్టర్‌ సుదక్షిణదేవీ, వైద్య విధాన పరిషత్‌ కో ఆర్డినేటర్‌

జిల్లాలో వివిధ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న వైద్యులు, ఉద్యోగుల వివరాలు, ఇతర జిల్లాల్లో ఒరిజినల్‌ పోస్టిం గ్‌ కలిగియుండి జిల్లాలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల ను ఉన్నతాధికారులకు ఇటీవల అందిచాము. ఈ వ్యవహారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది.

ఎలాంటి సమాచారం అడగలేదు

- డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిప్యూటేషన్‌ విధులపై ఉన్న తాధికారులు ఎలాంటి సమాచారం అడగలేదు. పలు ఆసుపత్రుల్లో వైద్యా ధికారులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర ఉద్యోగులు డిప్యూటేషన్‌పై పనిచేస్తు న్నారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు సైతం పలువురు ఉద్యోగులు ఇతర జిల్లాలకు వెళ్లి పనిచేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:59 AM