Share News

బాలల హక్కులను పరిరక్షించాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:03 AM

బాలల హక్కుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు.

బాలల హక్కులను పరిరక్షించాలి

కరీంనగర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాలల హక్కుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాలల రక్షణ చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్‌, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, కార్మికశాఖ కమిషనర్‌ శ్యాముల్‌జాన్‌, డీసీపీవో శాంత పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:03 AM