Share News

అరచేతిలోనే అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:07 AM

జగిత్యాల పట్టణంలోని మున్సిపల్‌ మార్కెట్‌లో గత ప్రభుత్వం హ యాంలో గోడలపై ఏర్పాటు చేసిన ప్రచారపు రాతలు, రాజకీయ నేత ల బొమ్మలు అదేవిధంగా ప్రదర్శిస్తున్నారంటూ ఓ వ్యక్తి సీ-విజిల్‌ యాప్‌న కు ఫిర్యాదు చేశారు.

అరచేతిలోనే అక్రమాలకు చెక్‌

జగిత్యాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల పట్టణంలోని మున్సిపల్‌ మార్కెట్‌లో గత ప్రభుత్వం హ యాంలో గోడలపై ఏర్పాటు చేసిన ప్రచారపు రాతలు, రాజకీయ నేత ల బొమ్మలు అదేవిధంగా ప్రదర్శిస్తున్నారంటూ ఓ వ్యక్తి సీ-విజిల్‌ యాప్‌న కు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు వెంటనే అక్కడి వెళ్లి సుమా రు 40 నిమిషాల్లోపు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో ఓ జాతీయ పార్టీకి చెందిన నేతలు తమ అభ్యర్థికి అనుకూలంగా గోడలపై రాతలు, ప్రచార పోస్టర్లను అతికించారని ఓ వ్యక్తి సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన అధికారులు వాటిని తొలగించారు. ఇలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన యాప్‌ల ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేస్తుండడం, అధికారు లు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటుండడం జరుగుతోంది.

లోక్‌ సభ ఎన్నికల సందడి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఎన్నికలు మరింత పారద ర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రత్యేక యాప్‌లు, టోల్‌ ఫ్రీ నంబర్లును అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు జగిత్యాలలో గల డిస్ట్రిక్ట్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పా టు చేసి ఓటర్లు, అభ్యర్థులు, పార్టీలకు అవసరమైన ఎన్నికల సేవలను అధికారులు అందిస్తున్నారు. ఇందుకు 18004257620 టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో సువిధ, సీ-విజిల్‌, 1950 ఫిర్యాదులు, పరిష్కారాలు ..

జిల్లా వ్యాప్తంగా ఇప్పవరకు 1950 కాల్‌ ద్వారా 777 ఫిర్యాదులు అధి కారులకు అందాయి. ఇందులో 157 ఓటరు నమోదు, ఎపిక్‌ కార్డు సం బంధిత ఫిర్యాదులు కాగా 10 ఇతర సమస్యలపై కాల్స్‌ వచ్చాయి. ఇందు కు గానూ అధికారులు 777 ఫిర్యాదులకు స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 45 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 41 ఫిర్యాదులు రిటర్నింగ్‌ అధికారి, అసి స్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి స్థాయిలో పరిష్కరించగా, 4 ఫిర్యాదులను ఏ ఆర్‌వో స్థాయిలో పరిష్కరించారు. జిల్లాలో కోరుట్ల సెగ్మెంట్‌లో 26, జగిత్యాలలో 14, ధర్మపురిలో 5 ఫిర్యాదులు సీ-విజిల్‌ యాప్‌ ద్వారా అధి కారులకు అందాయి. సుమారు 47 నుంచి 58 నిమిషాలలోపు అధికారు లు స్పందించి చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సు విధ యాప్‌ ద్వారా 54 అనుమతుల కోసం దరఖాస్తులు రాగా ఇందులో 37 అనుమతించారు. 4 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉండగా, 7 దరఖాస్తులు పెండింగ్‌లో, 6 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు..

ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘిస్తే సీ-విజిల్‌ యా ప్‌ ద్వారా ఎన్నికల అధికారికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల స మయంలో అభ్యర్థులు, అనుచరగణం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రించినా, అల్లర్లకు పాల్పడినా, డబ్బు, మద్యం, ఇతరత్రా కానుకలు పంపి ణీ చేసినా దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమి షాల్లో అధికారులు చర్యలు తీసుకుంటారు.

సువిధ యాప్‌...

ఈ యాప్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, రాజకీయ పక్షాలకు ఉ పయోగపడుతుంది. సింగిల్‌ విండో సిస్టమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రచార వా హనాలకు, మైకులు, సభలు, సమావేశాలకు తదితర పలు రకాల అను మతులు పొందడానికి వీలుంటుంది. ఈ యాప్‌ను వినియోగించుకుని అ భ్యర్థులు ఇంటి నుంచే అనుమతులు పొందవచ్చు. సంబంధిత నోడల్‌ అ ధికారి, సెక్షన్‌ అధికారులు సాంకేతిక అధికారులు అందుబాటులో ఉంటా రు. దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చిన పత్రాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే అనుమతులు ఇస్తారు.

డౌన్‌ లోడ్‌ ఇలా...

ఇంటర్నెట్‌ కలిగి అండ్రాయిడ్‌ ఉన్న మొబైల్‌తో గూగుల్‌ ప్లేస్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సీ-విజిల్‌, సువిధ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకునేలా ఈసీ అందుబాటులోకి తెచ్చింది. వీడియోలు, ఫొటోలు చిత్రీకరించేటప్పుడు ఆటోమేటిక్‌గా వాటికి జియో ట్యాగింగ్‌ కూడా వస్తుంది. అధికారుల దర్యాప్తులో ఇదే కీలక సా క్ష్యంగా అవుతుంది. సమస్యను బట్టి పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచుతారు.

ఓటరు సందేహాల నివృత్తికి 1950....

ఓటుకు సంబంధించిన ఏ సందేహానికైనా టోల్‌ఫ్రీ నెంబరు 1950కి ఫో న్‌ చేయొచ్చు. ఓటరు కార్డు స్టేటస్‌, ఓటు నమోదు, పోస్టల్‌ఓటుకు సం బంధించిన వివరాలు, ఇతరత్రా సమాచారం ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు ను. ఓటరు కార్డు వివరాలుంటే పోలింగ్‌ కేంద్రం పరిధి కూడా తెలుసు కునే వీలుంటుంది. 24 గంటలు ఈ నెంబరు అందుబాటులో ఉంటుంది.

పారదర్శకత కోసం మరిన్ని....

లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మూడు యాప్‌లు ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ప్లే స్టోర్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకోవచ్చు. హెల్ప్‌ లైన్‌ యాప్‌, సక్షం, నో యు వర్‌ కాండిడేట్‌ తదితర యాప్‌లను ఎన్నికల సంఘం ఓటర్లకు అందు బాటులోకి తీసుకవచ్చింది.

ఓటరు జాబితాలో తప్పుల సవరణ...

ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటర్లు ఓటరు జాబితాలో తమ పే ర్లు ఉన్నాయో లేవో చూసుకోవచ్చు. తప్పుల ఫిర్యాదు, ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది.

వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయం

వృద్ధులు, దివ్యాంగుల కోసం సక్షం ఈసీఐ అనే యాప్‌ను అందుబా టులోకి తెచ్చింది. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అధికా రులు ఈ వివరాలను పరిశీలించి, దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్‌ కేంద్రా లకు వచ్చి ఓటు వేసేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. సహాయ కుడితో పాటు మూడు చక్రాల సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. పో లింగ్‌ కేంద్రం వద్ద దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విదంగా ర్యాంప్‌ లను సైతం ఏర్పాటు చేస్తారు.

అభ్యర్థుల సమాచారం కోసం...

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్య ర్థుల వివరాలను తెలుసుకునేందుకు నో యువర్‌ కాండిడేట్‌ (కేవైసీ) అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అభ్యర్థుల వివరాలు, వి ద్యార్హతలు, నేర చరిత్ర, ఆస్తులు తదితర వివరాలు ఉంటాయి. ఓటర్లు ఎ ప్పటికప్పుడు అభ్యర్థుల వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి

- షేక్‌ యాస్మిన్‌ బాషా, కలెక్టర్‌

ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటు లోకి తెచ్చిన సాంకేతికతను ఓటర్లు, రాజకీయ పక్షాలు, అభ్యర్థులు సద్వి నియోగం చేసుకోవాలి. ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా, ప్ర శాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి అన్ని విధాలుగా జాగ్రత్త లు తీసుకుంటున్నాము. అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు చేస్తే అవసరమైన చర్యలు తీసుకుంటాము.

నిరంతరం అప్రమత్తంగా..

హకీం, జిల్లా ఎన్నికల విభాగం తహసీల్ధార్‌

పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అధికారులు, ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్వ హిస్తున్న యాప్‌ సేవలు అందించడానికి ప్రత్యేకంగా అధికారులు, ఉద్యో గులు పనిచేస్తున్నారు. ఎటువంటి అనుమానాన్ని అయినా నివృత్తి చేసుకో వాలి. ఎన్నికల సంఘం, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు, ఆదేశా లు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాము.

Updated Date - Apr 26 , 2024 | 12:07 AM