Share News

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:48 AM

కాళేశ్వరం అవినీతిపై సీబిఐ విచారణ చేపట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాళేశ్వరం అవినీతిపై సీబిఐ విచారణ చేపట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాల్సిందేనని, కేసీఆర్‌ కుటుంబానికి సాగునీటి ప్రాజెక్టులు ఏటీఎంలాగా మారాయ న్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతుందని, ఫోన్‌ ట్యాపింగ్‌కు కారణమైన కేసీఆర్‌ కుటుంబంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నాఫోన్‌ను ట్యాపింగ్‌ చేసిందన్నారు. బీజేపీ కోర్‌ కమిటీ సమా వేశంలో మాట్లాడుకున్నవి సైతం ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్నారన్నారు. రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావులు మా పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసి కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీలు ప్రయోగించారని అన్నారు. కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అధికారులు అదే ఫోన్‌ ట్యాపింగ్‌తో బెదిరించి ఆస్తులు దండుకున్నారన్నారు. అధికారులు ప్రభుత్వం ఒక్క ఫోన్‌ ట్యాప్‌ చేయమంటే వారు వ్యాపారులవి, అధికారులవి ఫోన్‌ ట్యాప్‌ చేసి ఆస్తులు దండుకున్నారన్నారు. నయీం ఆస్తులు కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై సిట్‌ విచారణ కొనసాగించాలన్నారు. డ్రగ్స్‌, మియాపూర్‌ భూముల కుంభకోణంపై విచారణ చేపట్టాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, మళ్లీ పాంచ్‌ న్యాయ్‌పేరుతో హామిలిస్తుందన్నారు. నేతన్నలకు మద్ధతుగా ఈ నెల 10వ తేదీన సిరిసిల్లలో దీక్ష చేపట్టనున్నామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు మోసపూరిత పార్టీలేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ పదేళ్ల పాటు 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించ లేదన్నారు. పది సంవత్సరాల్లో 11 లక్షల మంది రైతులు చనిపోతే ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. ఇప్పుడు రైతుల పక్షాన మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. గతంలో వడగండ్ల వానతోనష్టపోయిన రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు వచ్చి ఎకరాన పది వేలు ఇస్తామని ఒక్కపైనా ఇవ్వలేదన్నారు. పదేళ్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ మాట్లాడే భాష ఏమిటని ప్రశ్నించారు. సిరిసిల్లలో వరి కుప్పలపై రైతులు చనిపోయినా పట్టించుకోలేదన్నారు. ఫసల్‌ బీమా అమలు చేయ లేదని, సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు అమలుచేయలేదన్నారు. రైతులకు లక్ష రుణ మాఫీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా, వరికి 500 బోనస్‌, మహిళలకు 2500, గ్యాస్‌, ఆసరా పింఛన్లు, రుణమాఫీ, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అమలు ఎందుకు చేయడంలో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. సమావేశంలో మాజీ మేయర్‌ డి శంకర్‌, మాజీ డిప్యూటి మేయర్‌ గుగ్గిళ్లపు రమేష్‌, చెన్నమనేని వికాస్‌రావు, వాసాల రమేష్‌, కొలగాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:48 AM