Share News

బీఆర్‌ఎస్‌ నుంచి పారిపోతున్న అభ్యర్థులు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:29 AM

అవినీతి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయలేమంటూ లోక్‌ సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే పారిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి పారిపోతున్న అభ్యర్థులు
సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 19 : అవినీతి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయలేమంటూ లోక్‌ సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే పారిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెషన్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌ అధ్యక్ష తన నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే జీర్జించుకోలేక పోతన్నారన్నారు. ‘ఏడాదిలో కూలిపోతుంది.. మనమే అధికారంలోకి వస్తాం’ అని బీఆర్‌ఎస్‌ నాయకులు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీకి దమ్ముంటే ఒక్కసారి కాంగ్రెస్‌ను టచ్‌ చేసి చూడాలని సవాల్‌ విసిరారు. పదేళ్ల ప్రతి పక్షంలో ఉన్నా ప్రభుత్వంపై కొట్లాడామన్నారు. సిరిసిల్ల అసెంబ్లీలో ఓడి పోయినా 288 పోలింగ్‌ బూత్‌లలో 100కు పైగా కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం 288 పోలింగ్‌ బూత్‌లలో మెజార్టీ తీసుకొచ్చినవారిని సన్మాని స్తామన్నారు. భయపడి పొన్నం కరీంనగర్‌ నుంచి పారి పోయాడని ఓ బీజేపీ నాయకుడు మాట్లాడడం సిగ్గుచేటని, తాను మొగాడిని కాబట్టే హుస్నాబాద్‌లో గెలిచానని అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్‌ వీడి వారణాసీలో పోటీ చేసి గెల వడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం తెలియనోడు కూడా రాజకీయాల్లోకి వచ్చాడని విమర్శించారు. 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. పది సంవత్సరాల తరు వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. అగస్టులో రూ.2లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్య మంత్రి ప్రకటించారన్నారు. దేశ వ్యాప్తంగా రైతు రుణాలను కాంగ్రెస్‌ ప్రభుత్వమే మాఫీ చేసిందని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మాఫీ చేయలేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ప్రాణాలను తీస్తోందని, ఎన్నికల సమయంలో మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే రూ. 60 కోట్లు అప్పు చేస్తే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ 7లక్షల కోట్లు అప్పులు మిగిల్చిందని అన్నారు. మరో రూ. 40 వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇష్టారీతిలో లక్షల కోట్లు ప్రొసిడింగ్స్‌ ఇచ్చిందన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బతుకమ్మ చీరల బకాయిలు రూ. 270 కోట్లు పెండింగ్‌ పెట్టిపోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన విభజన హామీలను అమలు చేయలేదన్నారు. కేంద్రం నాలుగు టెక్స్‌టైల్‌ పార్కులు ఇచ్చిందని, సిరిసిల్లకు రావాల్సిన టెక్స్‌టైల్‌ పార్క్‌ వరంగల్‌కు వెళ్తుంటే ఆపలేని దద్దమ్మ ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశంలో నియంతృ త్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండదని విశ్వగురువు పేరుమీద రాజ్యాంగంపై ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు.

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఎపుడైనా ఎవరింటికైనా వచ్చారా? అని ప్రశ్నించారు. ఎంపీగా బండి సంజయ్‌ వేము లవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాల అభివృ ద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల నేత కార్మికులకు యాన్‌ సబ్సిడీపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కార్మికులు, ఆసాములు ఆర్థికంగా ఎదగడానికి కొత్త విధానానికి ప్రణాళికను తీసుకొస్తుందని అన్నారు. 20 రోజులలో లోక్‌ సభ ఎన్నికలు ఉన్నాయని, కాంగ్రెస్‌కు కార్య కర్తలే బలమని అన్నారు. నియోజకవర్గం పరిధిలోని అంద రూ శ్రమించాలని, కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.

రాష్ట్రంలో ఊడ్చుకుపోయిన బీఆర్‌ఎస్‌

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఊడ్చుకుపోయిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. హైదరాబాద్‌ తుక్కుగూడలో ప్రకటించిన పాంచ్‌ న్యాయ్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి బయటపడడంతో బజార్‌లో పడిందని, దేశంలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారున్న కేసీఆర్‌ ముందు నీ ఎమ్మెల్యేలను కాపాడుకో’ అని హెచ్చరించారు. లోక్‌ సభ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి మెజార్టీ తీసుకొస్తే రానున్న మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుందన్నారు. రెండుమూడు రోజుల్లో కరీంనగర్‌ లోక్‌ సభ కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటిస్తారని, అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి ఆగదని ఆ బాధ్యత తనదని అన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌, ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంను కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. అనంతరం వీర్నపల్లి ఉప సర్పంచ్‌తోపాటు వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌ర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, సత్యనారాయణగౌడ్‌, హుజూరాబాద్‌, కరీంనగర్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రణవ్‌, పెరమాండ్ల శ్రీనివాస్‌, తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజులలింగరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు, కాముని వనిత, వెల్ముల స్వరూప, మడుపు శ్రీదేవి, మ్యాన ప్రసాద్‌, వైద్య శివప్రసాద్‌, గొట్టె రుక్మిణి, చక్రధర్‌రెడ్డి, సామల పావని, సామల దేవదాస్‌, వంగ మల్లేశం గౌడ్‌, గుడిశెట్టి బాలరాజు, ఎండీ అహ్మద్‌, ఎండీ ఖా జా, సంగీతం శ్రీనాథ్‌, మునిగెల రాజు, వెల్ముల తిరుపతి రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, సిరిసిల్ల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన నాయకులు

సిరిసిల్లకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సీఐటీ యూ, జేఏసీ నాయకులు కలిశారు. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, వెంటనే కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శికూరపాటి రమేష్‌, జేఏసీ నాయకులు మూశం రమేష్‌, గోలి వెంకటరమణ, మండల సత్యం, తాటిపాముల దామోదర్‌, వేముల దామోదర్‌, గోవింద్‌ రవి, వెల్దండి శంకర్‌, కోడం రమణ, సిరిమల సత్యం, నక్క దేవదాసు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:29 AM